GNTR: వికలాంగుడికు ఉచిత పెట్రోల్ మంజూరుకై దృవీకరణ కోసం అందిన అర్జీని 24గంటలలోపు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్టిఫికెట్‌ను అందించామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో బాలకృష్ణ అనే వ్యక్తికి కమిషనర్ సర్టిఫికెట్‌ను అందించారు. అర్జీ పరిష్కారంలో త్వరితగతిన స్పందించిన పీఓ రామారావుని కమిషనర్ అభినందించారు.
NLR: కావలి కనకపట్నం ఎమ్మెల్యే కావ్యతోనే సాధ్యమని టీడీపీ నేత తిరువీధి ప్రసాద్ అన్నారు. కావలి పట్టణంలోని ట్రంకు రోడ్డుకు దివంగత నేత మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం కావలి పట్టణంలోని ఐ లవ్ యు కావలి సెల్ఫీ పాయింట్ దగ్గర నేతలు సంబరాలు చేశారు.
అన్నమయ్య: మునిసిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని శుక్రవారం మదనపల్లె పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం ముందు కార్మికులు నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరి శర్మ మాట్లాడుతూ.. పీఎఫ్, ఈఎస్ఐ సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే డైలీ వేజెస్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
NLR: జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ శుక్రవారం సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిరుమలతిప్ప ఎస్టీ ఏరియాను సందర్శించారు. వైద్య సిబ్బంది చేస్తున్న లెప్రసీ సర్వేను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, స్థానిక వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
W.G: యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో వినుకొండ నాగేశ్వరావు (60) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈయనకు ఒక కుమారుడు ఉండేవాడు. ఇటీవల కాలంలో అతను కూడా చనిపోవడంతో అతని కుమార్తె, మనవరాలు ఇనుకొండ శరణ్య.. వినుకొండ నాగేశ్వరావుకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించింది.
PLD: నరసరావుపేట పట్టణ టు టౌన్ ఎస్సైగా లేఖ ప్రియాంక శుక్రవారం ఉద్యోగ బాధ్యతను స్వీకరించారు. వారు మహిళా పోలీస్ స్టేషన్ నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. కాగా గతంలో రూరల్ పోలీస్ స్టేషన్‌లోనూ విధులు నిర్వహించారు. పట్టణంలోని స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఎస్సై తెలిపారు.
W.G: డ్రోన్ స్ప్రేయింగ్ కారణంగా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తణుకు మండల వ్యవసాయాధికారి కె.కుసుమ పేర్కొన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా డ్రోన్ స్ప్రేయింగ్‌పై రైతులకు అవగాహన కల్పించారు. సమయం, ఖర్చు, శ్రమ తగ్గుతుందని తుంపర్లు కూడా చాలా సూక్ష్మంగా పడటం వల్ల తెగుళ్లను పూర్తిగా అరికట్టవచ్చని చెప్పారు.
ELR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శుక్రవారం ఉపాధ్యాయులు, విద్యార్థులకు బాలికా సంరక్షణ, పోషణ, విద్య అంశాలపై సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యతో పాటు వారి ఆహారం, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారించాలని సూచించారు.
బాపట్ల: అభివృద్ధిపై సమగ్ర వివరాలతో డిడిఆర్సి సమావేశానికి అధికారులు తాజా సమాచారాన్ని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. డిడిఆర్సి సమీక్ష నిర్వహణపై మందస్తు సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఇంటింటి ప్రజారోగ్య సర్వే నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఇప్పటివరకు 66,946 గృహాలలో ఆరోగ్య సర్వే పూర్తి చేశామన్నారు.
SKLM: మందస పరిధిలో గల 57 గ్రామ సంఘాలు కూడా A గ్రేడ్‌లోనే ఉండేటట్లు సిబ్బంది అందరూ పనిచేయాలని వెలుగు పీవో పైడి కూర్మారావు అన్నారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల సామాజిక ఆర్థిక అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి గ్రామ సంఘంలో కూడా అందరికీ వివరించాలన్నారు.
సత్యసాయి: పెనుకొండ మండలంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆర్.డి.టి, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వారసులు అంటే అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కుడా అని తెలిపారు. బాలలు మన జాతీయ సంపద అని వారిని కాపాడవలసిన భాద్యత ప్రతి ఒక్కరిదని సూచించారు.
TPT: రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఫిబ్రవరి 4వ తేదీన అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. NRIలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.
KRNL: కర్నూలులోని క్లస్టర్ యూనివర్సిటీ 5వ సెమిస్టర్ డిగ్రీ ఫలితాలను వీసీ ఆచార్య డీవీఆర్ సాయి గోపాల్ శుక్రవారం విడుదల చేశారు. 2024 అక్టోబర్ నెలలో నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల్లో 206 మంది ఉత్తీర్ణత సాధించారని క్లస్టర్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ వీవీఎస్ కుమార్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. నాగరాజ్ శెట్టి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపారు.
ATP: కర్ణాటక రాష్ట్రం మైసూరులోని భారతీయ పురావస్తు శాఖ సౌత్ ఇండియా కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ మునిరత్నం రెడ్డిని శుక్రవారం గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. గుత్తికోట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. అందుకు డైరెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు.
KRNL: పాఠశాల కేంద్రంగా అమలవుతున్న విద్యావిధానాలు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మకంగా సత్ఫలితాలు సాధించాలని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వి.విజయరామరాజు అన్నారు. కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని పాఠశాలలను బలోపేతం చేయడం, జీవో నం.117 ఉపసంహరణ అనంతర పరిణామాలపై సమీక్ష నిర్వహించారు.