• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు ఉంగుటూరులో జాతీయ ఓటర్ల దినోత్సవం

ELR: ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుగుతుందని ఎన్నికల డీటీ పోతురాజు తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ ఓటర్‌ను సన్మానం చేయటం, కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల డీటీ పోతురాజు తెలిపారు.

January 24, 2025 / 02:11 PM IST

26న మాంసం అమ్మకాలు నిషేధం

ప్రకాశం: అద్దంకి పట్టణంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం, మాంసం, చేపలు అమ్మడం నిషేధమని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించి మాంసం, చేపలు అమ్మినా, వధించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

January 24, 2025 / 02:02 PM IST

ఎస్పీ కార్యాలయంలో దివాస్ కార్యక్రమం

ఏలూరు: జంగారెడ్డిగూడెం పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిధిలో పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది వద్ద నుంచి ఎస్పీ ప్రతాప్ కిషోర్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన వారి సమస్యలపై సమగ్రంగా విచారణ చేసి వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు.

January 24, 2025 / 02:00 PM IST

జలాశయంలో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే

W.G: బుట్టాయగూడెం మండలం అలివేలు వద్ద గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలోకి పోలవరం MLA చిర్రి బాలరాజు శుక్రవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్య కారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ITDA పీవో, RDO, జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పాల్గొన్నారు.

January 24, 2025 / 01:46 PM IST

సైనిక్ స్కూల్ విద్యార్థి ఆచూకీ లభ్యం

VZM: కోరుకొండ సైనిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఉత్కర్ష్ మోహన్ బనార్కర్ ఈనెల19న విజయనగరం రైల్వే స్టేషన్‌లో అదృశ్యమైన సంగతి తెలిసిందే పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో గౌహతి ట్రైన్‌లో బాలుడి ఆచూకీ లభ్యమైనట్లు ఎస్సై అశోక్ కుమార్ గురువారం తెలిపారు. త్రిపుర సమీపంలోని ధర్మనగర్ వద్ద విద్యార్థి ఆచూకీ గుర్తించామని తెలిపారు.

January 24, 2025 / 01:43 PM IST

రేపే మెగా జాబ్ మేళా

ఏలూరు: కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కళాశాలలో జనవరి 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్‌లో సుమారు 180 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తున్నామన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివి  వయసు 18-35 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు.

January 24, 2025 / 01:43 PM IST

ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

W.G: ప్లాస్టిక్ వాడకంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ప్రజలందరూ సామాజిక బాధ్యతగా అరికట్టాలని రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. భీమవరం విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించారు.

January 24, 2025 / 01:25 PM IST

రోడ్డు భద్రత వారోత్సవాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన

NLR: సంగం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆటో డ్రైవర్లకు సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించొద్దని..రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

January 24, 2025 / 01:18 PM IST

కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

ATP: ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం ఏపీ మార్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. మద్దతు ధర క్వింటాలకు రూ.7750లకు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నాయక్, టీడీపీ మండల కన్వీనర్ శ్రీనివాసులు, నియోజకవర్గ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

January 24, 2025 / 01:09 PM IST

‘నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలి’

సత్యసాయి: రొద్దం మండలం సానిపల్లిలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంది పంట రైతులను పలకరించారు. కంది పంట రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తీ విఫలం అయ్యిందన్నారు. నష్టపోతున్న రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ కమిటీని ప్రకటించారు.

January 24, 2025 / 01:05 PM IST

టీడీపీ నాయకుడికి మాజీ మంత్రి నివాళి

NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు శుక్రవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా వారి స్వగృహానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

January 24, 2025 / 12:44 PM IST

గోకులం షెడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రావణ్

GNTR: మేడికొండూరు మండలం పొట్లపాడు గ్రామంలో మినీ గోకులం షెడ్డును తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జంగంగుంట్లపాలెం గ్రామంలో రూ.4లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

January 24, 2025 / 12:44 PM IST

పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ

సత్యసాయి: నల్లచేరువు మండలంలోని ఇందుకురివారిపల్లి, దేవరింటిపల్లి గ్రామాల్లో శుక్రవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు నట్టాల నివారణ, గర్భకోశ వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ మల్లికార్జున, ఇస్మాయిల్ AHAS దశరథ్, మమత, రాహుల్ ,భవ్య, గంగులప్ప, రాజేశ్వరి, సరోజ, రంగయ్య గోపాలమిత్రలు పాల్గొన్నారు.

January 24, 2025 / 12:43 PM IST

‘పరిటాల రవీంద్ర ఆదర్శ నాయకుడు’

NLR: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిటాల రవీంద్ర ఆదర్శ నాయకుడు, ప్రజల సమస్యలపై మమకారం, నిర్భయతతో ముందుకు సాగిన నాయకుడని కొనియాడారు.

January 24, 2025 / 12:39 PM IST

పరిటాల రవీంద్ర విగ్రహం ఏర్పాటు చేస్తాం

సత్యసాయి: టీడీపీ కార్యాలయంలో శుక్రవారం దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 21వ వర్ధంతి వేడుకలకు పెనుగొండ పట్టణంలో పరిటాల విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తామని వెల్లడించారు.

January 24, 2025 / 12:33 PM IST