• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘సీఎంతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం’

ATP: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్- నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరగడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ప్రఖాత సంస్థలు ఏపీకి రావడం, ఇక్కడి పారిశ్రామిక ప్రగతిని సూచిస్తోందన్నారు.

March 25, 2026 / 09:00 PM IST

‘శ్రీరామ నవమికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు’

E.G: శ్రీరామనవమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26న రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు DPTO వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. భద్రాచలంతో పాటు సమీప క్షేత్రాలకు అద్దెపై బస్సులు కూడా ఏర్పాటు చేశామన్నారు. గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల నుంచి కూడా భద్రాచలానికి బస్సులు ఉంటాయని పేర్కొన్నారు.

March 25, 2026 / 08:53 PM IST

పేకాట శిబిరాలపై దాడులు.. భారీగా నగదు స్వాధీనం

ప్రకాశం: పామూరు మండలం అనుములకొండ గ్రామ శివారులో పేకాట శిబిరాలపై ఎస్సై అనుక్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.21,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో ఎక్కడైనా పేకాట, జూదం వంటివి నిర్వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 25, 2026 / 08:45 PM IST

బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి: మంత్రి

GNTR: రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని హాస్టళ్లలో మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

March 25, 2026 / 08:44 PM IST

ఇంటి పన్నులు చెల్లించండి: కమిషనర్

W.G: తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఇంటి పన్ను బకాయిలు రూ.17.26 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.11.13 కోట్లు వసూలు చేశారు. దాదాపు 65 శాతం పన్నులు వసూలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు బుధవారం సాయంత్రం తెలిపారు. మరో రూ. 4కోట్లు కుళాయి పన్నులు వసూలు చేయవలసి ఉందన్నారు. ఈ నెల 31లోగా చెల్లిస్తే ఆస్తి, ఖాళీ స్థలం పన్నుపై 50 శాతం వడ్డీ రాయితీ ఉంటుందన్నారు.

March 25, 2026 / 08:39 PM IST

నిరుద్యోగులకు ఉపాధి కోసం జాబ్ మేళా

AKP: స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అచ్యుతాపురంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రతి మూడు నెలలకు ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు నిర్వహించిన జాబ్ మేళాలో 600 మంది ఉద్యోగాలు పొందనున్నట్లు తెలిపారు.

March 25, 2026 / 08:33 PM IST

ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన

KDP: వీరబల్లిలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 70 మందికి పరీక్షలు నిర్వహించారు. 22 మందికి కాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని గుర్తించి కడపకు తరలించగా, 30 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

March 25, 2026 / 08:33 PM IST

ఈ నెల 27న జాబ్ మేళా

కోనసీమ: ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధి ఆఫీస్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు ఎస్ఎస్‌సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలకు 8978905032 ను సంప్రదించాలన్నారు.

March 25, 2026 / 08:33 PM IST

రైతుల సమస్యలు తెలుసుకున్న జేసీ

NLR : బుచ్చిరెడ్డి పాలెం మండలం మినుగల్లు గ్రామంలో రైతులతో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ముచ్చటించారు. ధాన్యం కొనుగోలు ధరలు మార్కెట్‌లో ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన ధాన్యానికి 24 గంటల్లో నగదును జమ చేస్తున్నామన్నారు. రైతులు పలు సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

March 25, 2026 / 08:31 PM IST

‘విదేశీ పక్షుల సంరక్షణకు పటిష్ట చర్యలు’

సత్యసాయి: విదేశీ పక్షుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం చిలమత్తూరు మండలం వీరాపురంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్బంగా వేసవి విడదికి వచ్చే సైబీరియన్ పక్షులకు అవసరమైన ఆహారం, నీరు సమకూరుస్తాం అన్నారు. చెట్ల పై నుంచి కింద పడే పక్షి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక సంరక్షకుడిని నియమించాం అన్నారు.

March 25, 2026 / 08:31 PM IST

‘పదవీ కాలం ముగిసిన ప్రజాసేవలో ముందుండాలి’

CTR: త్వరలో పదవీకాలం ముగియనున్న సర్పంచ్‌లకు వీకోట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ యువరాజ్ వారిని ఘనంగా సన్మానించారు. పదవీకాలం ముగిసిన ప్రజాసేవలో ముందుండాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. వారికి బకాయి బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.

March 25, 2026 / 08:30 PM IST

గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

ATP: తాడిపత్రి పట్టణంలోని హెచ్.పి గ్యాస్ ఏజెన్సీని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ బుధవారం తనిఖీ చేశారు. వేజ్ ఎంటర్‌‌ప్రైజెస్ రిజిస్టర్లను పరిశీలించి, గత 15 రోజుల బుకింగ్‌లు, డెలివరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సరఫరా సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.

March 25, 2026 / 08:29 PM IST

రైల్వే అండర్ బ్రిడ్జ్‌పై కీలక సమావేశం

అన్నమయ్య: రాజంపేటలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంపై అధికారులు, బాధితులతో కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ.. అభివృద్ధితో పాటు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయే వారికి నష్టపరిహారం అందించడంతో పాటు దుకాణదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

March 25, 2026 / 08:27 PM IST

జననగణన శిక్షణపై కమిషనర్ మౌర్య సమీక్ష

TPT: తిరుపతి కొర్లగుంటలో జరిగిన జననగణన-2027 క్షేత్రస్థాయి శిక్షణ కార్య క్రమాన్ని కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. ఎన్యుమరేషన్ యాప్ వినియోగంపై సిబ్బందికి సూచనలు చేశారు. నగరంలో 800 ఎన్యుమరేటర్లు, 150 సూపర్వైజర్లు నియమించామని తెలిపారు. ఏప్రిల్ 8 నుంచి తదుపరి శిక్షణ, మే నుంచి గణన ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

March 25, 2026 / 08:25 PM IST

నిజాయితీ చాటుకున్న కండక్టర్

ప్రకాశం: గుడ్లూరుకు చెందిన ఓ మహిళ బస్సులో మరిచిపోయిన సుమారు రూ.2 లక్షల విలువైన గోల్డ్ బ్రాస్లెట్‌ను మరిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసు బస్సు సిబ్బందిని సంప్రదించగా, కండక్టర్ చంద్రమోహన్ రావు ఆభరణాన్ని భద్రంగా ఉంచి గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి బాధితురాలికి అప్పగించాడు. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు కండక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 25, 2026 / 08:25 PM IST