VSP: మధురవాడ జోన్‌లో శుక్రవారం తాగునీటి సరఫరా అంతరాయం ఉంటుందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. గంభీరం వద్ద 700 మి.మీ ప్రధాన పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వార్డు 6, 7లోని సాయిరాం కాలనీ, కొమ్మాది, బక్కన్నపాలెం, మిధిలాపురి వుడా కాలనీ, పాత మధురవాడ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. అవసరమైతే ట్యాంకర్ కోసం సంబంధిత ఏఈలను సంప్రదించాలని సూచించారు.
ASR: జీకేవీధి మండలం మంగళపాలెం నుంచి గుణయలంక వరకూ జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో కాఫీ మొక్కలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. పలువురు గిరిజన రైతులకు చెందిన కాఫీ మొక్కలు పోతున్నాయన్నారు. అధికారులు కాఫీ మొక్కలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.
ATP: బ్రహ్మసముద్రం మండలం నంజాపురంలో తులసి అనే మహిళ మెడలో ఉన్న బంగారపు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. గురువారం ఆమె కళ్యాణదుర్గం నుంచి నంజాపురానికి స్కూటీలో బయలుదేరింది. గొంచిరెడ్డిపల్లి, ఐదుకల్లు గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు బైక్ లో వచ్చి మహిళ మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
SKLM: నగరంలో నెహ్రూ యువ కేంద్రంలో ఇవాళ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె. సుధ ఓ ప్రకటనలో తెలిపారు. 85 ఖాళీల భర్తీకి ఇంటర్ ఆపై విద్యార్హత కలిగి, 30 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.
కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం విస్తృతంగా అమలవుతోంది. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కట్టుదిట్టమైన తనిఖీలు, గస్తీలు కొనసాగుతున్నాయి. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి జాతర ఘనంగా ముగిసింది. జాతర సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
ASR: జీకేవీధి మండలంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని టీడీపీ మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు కోరారు. గురువారం పలువురు కూటమి నేతలతో కలిసి ఎంపీడీవో రమణబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అధికారులు సహకరించాలని కోరారు.
ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు పాత నాటు సారా కేసుల్లో ముద్దాయిలను గురువారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా వారిపై మెజిస్ట్రేట్ బైండోవర్ కేసుల నమోదు చేయడం జరిగిందని అన్నారు. అలాగే బైండోవర్ విధించబడిన వారు సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు.
ASR: ముస్లింలకు ఎంతో ప్రీతిపాత్రమైన రంజాన్ మాసం వచ్చేసింది. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని వారు భావిస్తారు. విధిగా 30 రోజులపాటు రోజూ ఉపవాసంతో పాటు ఈ నెలంతా ఖురాన్ పఠనంతో గడుపుతారు. ఈ క్రమంలో సీలేరు మసీదులో ఘనంగా రంజాన్ మాసం ప్రారంభమైంది. అల్లాహ్ నామస్మరణ చేసుకుంటూ.. ఉపవాసం ఆచరించే సమయంలో చెడు అలవాట్లు, దరి చేరకుండా ఉంటాయని ముస్లింలు తెలిపారు.
AKP: మహాశివరాత్రికి జిల్లా ఆర్టీసీకి రూ.28 లక్షల ఆదాయం వచ్చినట్లు డీపీటీవో ప్రవీణ గురువారం తెలిపారు. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి 104 బస్సు సర్వీసులను రెండు రోజులు పాటు వివిధ పుణ్యక్షేత్రాలకు నడిపినట్లు పేర్కొన్నారు. అలాగే, అనకాపల్లి నుంచి విజయవాడకు కొత్త బస్సు సర్వీసు ప్రారంభిస్తామన్నారు. నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు స్లీపర్ బస్సు నడుపుతామన్నారు.
W.G: నరసాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామరాజు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలు అందజేయవచ్చని తెలిపారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
SKLM: కొత్తూరు మండలం బ్రాహ్మణవీధికి చెందిన సాయికుమార్‌పై బీరు సీసాలతో దాడిచేసిన ఘటనలో గురువారం కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కె. వెంకటేశ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కొత్తూరుకు చెందిన టి.వినయ్ కుమార్, సిరుసువాడ గ్రామానికి చెందిన కె. తరుణ్‌ను కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు.
PLD: ఇటీవల పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి, జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రి విడదల రజిని గురువారం రాత్రి పరామర్శించారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన రజిని.. అంబటి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఆయనకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో చిలకలూరిపేట వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
CTR: జిల్లాలో రబీ పంటల సాగు కోసం 1150 టన్నుల యూరియా గురువారం చేరింది. ప్రస్తుతం జిల్లాలోని రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, గోదాముల్లో సుమారు 4,200 టన్నుల యూరియా నిల్వ ఉందని వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. యూరియా కొరత లేదని, అవసరమైన మండలాలకు వెంటనే సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ APFR Farmer ID కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ గురువారం సూచించారు. జిల్లాలో 2.07 లక్షల మంది రైతులకు గాను, కేవలం 1.69 లక్షల మందికే ఐడీ ఉందని తెలిపారు. ఈ గుర్తింపు ఉన్నవారికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, పంటల బీమా వంటి పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.