CTR: త్వరలో పదవీకాలం ముగియనున్న సర్పంచ్లకు వీకోట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ యువరాజ్ వారిని ఘనంగా సన్మానించారు. పదవీకాలం ముగిసిన ప్రజాసేవలో ముందుండాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. వారికి బకాయి బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.