SRCL: సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం 2026-27 సంవత్సరానికి గాను ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశం ప్రారంభమవుతుందని, అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు సాధారణ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాల్లో పట్టణ అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులపై చర్చించనున్నారు.