అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెల్లవారుజామున 5 గంటలకే ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు గంటల పాటు అన్ని వార్డులు తిరిగి రోగులకు అందుతున్న చికిత్స, మందులు, పరిశుభ్రతపై ఆరా తీశారు. వైద్యుల సేవలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, మందుల కొరత తీర్చాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.