కృష్ణా: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందడంపై కంకిపాడు మండల టీడీపీ సీనియర్ యలమంచిలి కిషోర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. కంకిపాడు టీడీపీ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ఏపీ ఉజ్వల భవిష్యత్తుకు ఇది నాంది అని కొనియాడారు.