JGL: జగిత్యాల ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులను కొట్టిన ఘటనపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. వార్డెన్ జి.శ్రీనివాస్ (కామాటి)పై జరిగిన విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.రాజ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.