• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

ATP: తాడిపత్రి పట్టణంలోని హెచ్.పి గ్యాస్ ఏజెన్సీని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ బుధవారం తనిఖీ చేశారు. వేజ్ ఎంటర్‌‌ప్రైజెస్ రిజిస్టర్లను పరిశీలించి, గత 15 రోజుల బుకింగ్‌లు, డెలివరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సరఫరా సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.

March 25, 2026 / 08:29 PM IST

రైల్వే అండర్ బ్రిడ్జ్‌పై కీలక సమావేశం

అన్నమయ్య: రాజంపేటలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంపై అధికారులు, బాధితులతో కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ.. అభివృద్ధితో పాటు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయే వారికి నష్టపరిహారం అందించడంతో పాటు దుకాణదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

March 25, 2026 / 08:27 PM IST

జననగణన శిక్షణపై కమిషనర్ మౌర్య సమీక్ష

TPT: తిరుపతి కొర్లగుంటలో జరిగిన జననగణన-2027 క్షేత్రస్థాయి శిక్షణ కార్య క్రమాన్ని కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. ఎన్యుమరేషన్ యాప్ వినియోగంపై సిబ్బందికి సూచనలు చేశారు. నగరంలో 800 ఎన్యుమరేటర్లు, 150 సూపర్వైజర్లు నియమించామని తెలిపారు. ఏప్రిల్ 8 నుంచి తదుపరి శిక్షణ, మే నుంచి గణన ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

March 25, 2026 / 08:25 PM IST

నిజాయితీ చాటుకున్న కండక్టర్

ప్రకాశం: గుడ్లూరుకు చెందిన ఓ మహిళ బస్సులో మరిచిపోయిన సుమారు రూ.2 లక్షల విలువైన గోల్డ్ బ్రాస్లెట్‌ను మరిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసు బస్సు సిబ్బందిని సంప్రదించగా, కండక్టర్ చంద్రమోహన్ రావు ఆభరణాన్ని భద్రంగా ఉంచి గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి బాధితురాలికి అప్పగించాడు. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు కండక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 25, 2026 / 08:25 PM IST

‘కుల వివక్షకు తావుండ కూడదు’

SKLM: జైళ్లలో కుల వివక్షకు తావుండ కూడదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. బుధవారం అంపోలులోని జిల్లా జైలును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డితో పాటు ‘బోర్డ్ ఆఫ్ విజిటర్స్’ బృందంతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో అందరికీ సమాన సౌకర్యాలు అందాలని అధికారులను ఆదేశించారు

March 25, 2026 / 08:24 PM IST

బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని బుధవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు.

March 25, 2026 / 08:24 PM IST

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారి

PPM: విక్రంపురంలో ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య తనిఖీ రికార్డులు, వైద్య పరీక్ష పరికరాల పనితీరు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్యం మెరుగుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.

March 25, 2026 / 08:24 PM IST

ఓటరు నమోదుపై రాజకీయ పార్టీలతో సమావేశం

BPT: అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఓటరు నమోదు అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (KORGRP R&R యూనిట్, ఒంగోలు) విజయ జ్యోతి కుమారి అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ ప్రక్రియపై వివరించారు.

March 25, 2026 / 08:23 PM IST

ఉత్తరాంధ్రకు భారీ పరిశ్రమతో కొత్త దిశ

KRNL: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం తెలిపారు. రూ.1.36 లక్షల కోట్లతో ఏర్పడనున్న భారీ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.

March 25, 2026 / 08:23 PM IST

నంద్యాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: నంద్యాల మండలం కానాల గ్రామపంచాయతీ పరిధిలోని హై స్కూల్ కొట్టాల గ్రామంలో ఇవాళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 25, 2026 / 08:22 PM IST

ఈఈపై సస్పెన్షన్ ఎత్తివేత..!

VSP: సింహాచలం దేవస్థానంలో చందనోత్సవంలో గోడ కూలిన పలువురు మరణించిన ఘటనలో సస్పెండ్ అయిన దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజుపై ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై విచారణ అనంతరం విధించిన క్రమశిక్షణా చర్యలను ఇప్పుడు రద్దు చేయడంతో, ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు.

March 25, 2026 / 08:18 PM IST

మంత్రి లోకేష్‌ను కలిసిన ఎన్జీవో నేతలు

GNTR: మంత్రి నారా లోకేష్‌ను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి విద్యాసాగర్ ఇతర జేఏసీ నేతలు సంయుక్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 25, 2026 / 08:16 PM IST

భద్రాచలంకు ప్రత్యేక బస్సులు

ELR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దర్శనానికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని ఆర్టీసీ విజయవాడ జోన్ 2 ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఏలూరు డిపో నుంచి 20 బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 14 బస్సులు, నూజివీడు నుంచి 6 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

March 25, 2026 / 08:13 PM IST

కేంద్ర మంత్రితో వేమిరెడ్డి దంపతుల భేటీ

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను బుధవారం కలిశారు. పెన్నా నది కరకట్టల బలోపేతం, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందచేశారు. 2011లో వచ్చిన వరదలు దాటికి ప్రజలు పడ్డ ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

March 25, 2026 / 08:13 PM IST

‘జీడీపీ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి’

SKLM: జిల్లాలో 3వ త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో GDP లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. జిల్లా అభివృద్ధి వేగవంతం కావాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం పథకాలకు బ్యాంకులు సమయానికి రుణాలు మంజూరు చేయాలన్నారు.

March 25, 2026 / 08:12 PM IST