• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మార్కాపురం జిల్లా సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో మృతుల వివరాలు, గాయపడిన వారి పరిస్థితిని అధికారులతో కలిసి తెలుసుకుంటూ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

March 26, 2026 / 10:23 AM IST

కోవెలకుంట్ల గ్రామపంచాయతీకి భారీ ఆదాయం

NDL: కోవెలకుంట్ల మేజర్ గ్రామపంచాయతీకి సంబంధించి వేలం పాటల ద్వారా రూ.35.09 లక్షల ఆదాయం సమకూరినట్లు జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి నరసింహారెడ్డి వెల్లడించారు. బుధవారం కోవెలకుంట్లలోని పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో సంత మార్కెట్, దినసరి కూరగాయల మార్కెట్, కబేళా మార్కెట్ తదితర వాటికి సంబంధించి వేలం పాటలను నిర్వహించారు.

March 26, 2026 / 10:21 AM IST

‘స్మశానంలో ఇళ్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు’

KRNL: ఆస్పరి మండలం నగరూరు గ్రామంలోని సమాధుల్లో ఇళ్లు కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. జగన్న కాలనీలో అభివృద్ధి పేరుతో రూ. 20 లక్షలు స్వాహా చేశారని, అవినీతిపరులపై కేసులు నమోదు చేసి నిధులను రికవరీ చేయించాలని శివప్రసాద్ డిమాండ్ చేశారు.

March 26, 2026 / 10:20 AM IST

మత్స్యకార భరోసా పథకంపై సర్వే

AKP: మత్స్యకార భరోసా పథకం కింద వేట నిషేధ సమయంలో వారికి అందించే సహాయంపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఎస్ రాయవరం మండలం పోలవరం గ్రామంలో సర్వే ప్రారంభించారు. సర్వే ద్వారా అర్హులైన వారిని గుర్తిస్తున్నట్లు మత్స్యశాఖకు చెందిన అసిస్టెంట్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు కొరివి బంగారి, టీడీపీ నేత కోడ లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.

March 26, 2026 / 10:20 AM IST

‘సంతబయలులో అక్రమ కట్టడాలను అరికట్టాలి’

ASR: డుంబ్రిగుడ మండలంలోని అరకు సంతబయలు గ్రామంలో గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే అరికట్టాలని ఆదివాసి గిరిజన సంఘం నేతలు పీ. సూర్యనారాయణ, పీ. సత్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామకంఠం, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.

March 26, 2026 / 10:20 AM IST

‘కళాశాల అనుమతులు తప్పకుండా ఉండాలి’

KRNL: ప్రభుత్వ అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఓ కళాశాల యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని PDSU రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ కార్యాలయంలో ఆర్‌వో లాలప్పకు వినతిపత్రం అందజేశారు. అనుమతి లేకుండా ప్రచారం చేస్తూ.. అడ్మిషన్లు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

March 26, 2026 / 10:15 AM IST

అన్నమరాజుపేటలో రాములోరి ఊరేగింపు

VZM: జామి మండలం అన్నమరాజుపేటలో శ్రీరామనవమి పురస్కరించుకొని ఇవాళ సీత, లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తిని గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులు భజనలు, సంకీర్తనలు ఆలపిస్తూ రాములోరి వెంట కదిలారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

March 26, 2026 / 10:15 AM IST

పెట్రోల్ నిల్వలపై కీలక ప్రకటన

ఏలూరు: జిల్లా వ్యాప్తంగా పెట్రోలు అందుబాటులో ఉందని ఎటువంటి కొరత లేదని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి నిల్వలు తీసుకోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కువ నిల్వలో ఉంటే 9550351100కు సమాచారం ఇవ్వాలన్నారు.

March 26, 2026 / 10:15 AM IST

ఈ నెల 28న పొన్నూరు మున్సిపల్ మార్కెట్ల వేలం పాట

GNTR: పొన్నూరు పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి వివిధ మార్కెట్ల వేలం నోటీసు విడుదల చేసింది. మార్చి 28న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో వేలం నిర్వహిస్తారు. కూరగాయలు, సండ్రీ, మాంసం, చేపల మార్కెట్, జంతు వధశాల వేలం జరుగుతుందని కమిషనర్ రమేష్ తెలిపారు. పాల్గొనేవారు అవసరమైన పత్రాలు సమర్పించి ఈఎండీ చెల్లించాలని ఆయన సూచించారు.

March 26, 2026 / 10:14 AM IST

ఆ ఇద్దరు MLAలకు కొత్త టెన్షన్.?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన రెండు రిజర్వ్ నియోజకవర్గాల్లో గుబులు రేపుతోంది. సత్యవేడు, పూతలపట్టు, GDనెల్లూరు నియోజకవర్గాలు SC రిజర్వేషన్‌లో ఉన్నాయి. వీటిలో పూతలపట్టు, సత్యవేడు జనరల్‌కు కేటాయించే అవకాశం ఉందని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తోంది.

March 26, 2026 / 10:14 AM IST

ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలు విడుదల

అన్నమయ్య: జిల్లాలో ఆర్టీఈ 12(1)(C) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల మొదటి విడత లాటరీ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ అనూరాధ ఈ వివరాలు తెలిపారు. జిల్లాలో 700 దరఖాస్తుల్లో 1 కి.మీ పరిధిలోని 464 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి SMS ద్వారా సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

March 26, 2026 / 10:13 AM IST

భారీ వర్షం.. జలమయమైన పార్వతీపురం

పార్వతీపురం పట్టణంలో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీటిలో నిలిచిపోయాయి. ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాశ్వత పరిష్కారం కోరుతున్నారు.

March 26, 2026 / 10:10 AM IST

‘వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి’

KDP: స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు కావడం హర్షదాయకమని జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు,పెట్టుబడుల ఆకర్షణకు విశేష ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయని ఆయన అన్నారు.

March 26, 2026 / 10:08 AM IST

జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్

W.G: ఆచంట (M) అయోధ్య లంకలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీనికి రూ.110 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ప.గో జిల్లా ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిధులు కేటాయించారు. వంతెన నిర్మాణం పూర్తయితే లంకగ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 26, 2026 / 10:04 AM IST

తాళాలు పగల కొట్టి కాపర్ మాయం చేసిన దుండగులు

KDP: పులివెందుల ప్రధాన రహదారిలోని MRF షోరూమ్ సమీపంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఓ విద్యుత్ మోటార్ మెకానిక్ షెడ్డులో తాళాలు పగలగొట్టి సుమారు 25 కేజీల కాపర్ దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. రైతులకు సంబంధించిన వైర్లు పోవడంతో మెకానిక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మెయిన్ రోడ్డుపైనే ఘటన జరగడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 26, 2026 / 10:03 AM IST