GNTR: అమరావతిలో బీటెక్ చదువుతున్న యువతిని అక్రమంగా నిర్బంధించారని తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణలో ఆమె స్వచ్ఛందంగా ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నానని వెల్లడించింది. తల్లిదండ్రులతో వెళ్లనని, భర్తతోనే ఉంటానని చెప్పడంతో, ఆమె మేజర్ కావడంతో కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
CTR: వీకోట వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణాల వద్ద ఉన్న తూనికల యంత్రాల్లో తేడా వస్తే కేసులు తప్పవని జిల్లా తూనికల కొలతల శాఖ అసిస్టెంట్ కమిషనర్ స్వామి హెచ్చరించారు. మార్కెట్ యార్డ్‌లోని మండీలను ఆయన తనిఖీ చేశారు. తూనికలు శాఖ ప్రమాణాలను నిర్ధారిస్తూ యంత్రాలకు సీలు వేస్తామని, వాటిని తొలగించి మోసం చేసి పట్టుబడితే కేసు నమోదు చేస్తామన్నారు.
VZM: జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మరణాలు సంభవించకుండా ప్రజల ప్రాణాల రక్షణ కోసమే వైద్య అధికారులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. మీటర్నల్ చైల్డ్ డెత్ సర్వేలెన్స్ రెస్పాన్స్ కమిటీ మూడు, నాలుగు క్వార్టర్లుకు సంబంధించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు .
కోనసీమ: అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో బుధవారం రాత్రి అమలాపురం రూరల్ ఎస్సై శేఖర్ బాబు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో వివిధ సమస్యలపై చర్చించారు. సోషల్ మీడియా గ్రూపులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం, మాదకద్రవ్యాలకు నిర్మూలన, మోటారు వాహన నియమాల ప్రాముఖ్యత, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి అవగాహన కల్పించారు.
NDL: పాములపాడు మండలంలోని రుద్రవరంలో మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలు బుధవారం పరిశీలించారు. మొక్కజొన్న పంటకు కంకులు రావడం లేదని ఫిర్యాదులు రావడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించినట్లు సమాచారం. రైతుల నుంచి శాస్త్రవేత్తలు పలు రకాల సమాచారాన్ని సేకరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
KRNL: పుదుచ్చేరిలోని నిర్వహించిన అంతర్జాతీయ వైద్య సదస్సు ‘కోయిసైన్సెస్ 8.0’లో కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు. కఠినమైన డిబేట్ పోటీల్లో ఫైనల్‌కు చేరిన KMC ఫైనల్ ఇయర్ విద్యార్థి కార్తీక్ అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ విజయంతో కర్నూలు మెడికల్ కాలేజీకి ‘సర్టిఫికెట్ ఆఫ్ హానర్స్’ ప్రదానం చేసింది.
SKLM: గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో బుధవారం హుండీలు తెరిచి కానుకలు లెక్కించారు. ఈవోలు వాసుదేవరావు, గుర్నాథరావు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, భక్తులు లెక్కించారు. 98 రోజులకు రూ.19.76 లక్షలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, వైదిక సిబ్బంది, సాధారణ దుస్తులు ధరించిన భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
VSP: విశాఖ- ఎస్ఎంవీ బెంగళూరు (08581/08582) మే మొదటి వారం వరకు ప్రత్యేక సర్వీసులుగానే నడుస్తాయని వాల్తేర్ సీనియర్ డీసీఎం పవన్ తెలిపారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులను పూర్తిస్థాయి వారాంతపు రైళ్లుగా మార్పు చేసే ప్రతిపాదన వాయిదా వేసినట్లు చెప్పారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలు వాయిదా పడిన విషయాలు ప్రయాణికులు గమనించాలన్నారు.
కృష్ణా: కూటమి ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి వెలుగుల్లో వెలుగుతున్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మండలం సాయిపురం, ముదునూరు జాగర్లపూడి పల్లెల్లో ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
కోనసీమ: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాటం చేయాలని జగన్ సూచించారని ఇజ్రాయిల్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు.
అన్నమయ్య: జిల్లా పెద్దమండ్యం మండలంలో నాటు సారా విక్రయిస్తున్న బుక్కే రవి నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రామానాయక్ తండాలో పోలీసులు దాడులు నిర్వహించి, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రావణి రెడ్డి తెలిపారు.
ప్రకాశం: బేస్తవారిపేటలోని గ్యాస్ గోడౌన్‌లో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా నిబంధనలు, అగ్నిమాపక సదుపాయాలు, సిలిండర్ల నిల్వ, రవాణా విధానాలను పరిశీలించారు. గోడౌన్ యజమానులు అన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్యాస్ కొరతను సృష్టిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జున, ఎస్సై రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.
ఏలూరు: నగరంలోని సీఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో బీ-ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న చిలుకూరి సువర్షినీ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గమనించిన హాస్టల్ వార్డెన్, ఆమెను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగని వైద్యం కోసం విజయవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తిరుమలలో ఇవాళ టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం మొత్తం 73,411 మంది శ్రీవారిని దర్శించుకోగా, 30,474 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లుగా నమోదైంది.
ఎన్టీఆర్: జి.కొండూరులోని హైస్కూల్‌కు వెళ్లే మార్గంలో కమ్యూనిటీ హాల్ వద్ద గురువారం ఎమ్మెల్యే ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని, ప్రజల వద్ద స్వీకరిస్తారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరింది.