• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అభా యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలి’

ASR: అభా యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఓపీ నమోదు కోసం గంటల తరబడి వేచి ఉండకుండా ‘అభా యాప్’ ద్వారా డిజిటల్‌గా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందన్నారు. రోగుల ఆరోగ్య రికార్డులు భద్రంగా ఉంటాయన్నారు. బుధవారం పాడేరు సర్వజన ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు.

March 26, 2026 / 09:20 AM IST

వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్

కర్నూల్: జిల్లాలో కూటమి ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా సీనియర్ సిటిజన్ కార్డులను ఉచితంగా అందిస్తున్నట్టు మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఇవాళ తెలిపారు. దీంతో వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ కార్డులతో ఆర్టీసీ బస్సులు, ఆస్పత్రుల్లో రాయితీలు పొందవచ్చు.

March 26, 2026 / 09:20 AM IST

ఉల్లి రైతుల సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి

NDL: డోన్ మండలం కొచ్చేరువులో బుధవారం కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పర్యటించి ఉల్లి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పంటకు వచ్చిన ఖర్చులు, దిగుబడి, రవాణా వ్యయం, మార్కెట్ ధరల గురించి రైతులను అడిగి వివరాలు సేకరించారు. రైతులకు న్యాయమైన ధర అందేలా ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని తెలిపారు. దళారులను నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని రైతులకు సూచించారు.

March 26, 2026 / 09:19 AM IST

కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ

నెల్లూరు 10వ డివిజన్, ఉస్మాన్ సాహెబ్ పేటలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు మార్చి 28 నుంచి ఏప్రిల్ 7 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 3న స్వామివారి కళ్యాణం, ఏప్రిల్ 4న రథోత్సవం ప్రధాన ఘట్టాలుగా నిర్వహించనున్నారు.

March 26, 2026 / 09:19 AM IST

రేపు ఒంటిమిట్టలో పోతన జయంతి వేడుకలు

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 27న పోతన జయంతి నిర్వహిస్తున్నట్లు తితిదే హిందూ ధర్మన్ ప్రచార పరిషత్ కార్యదర్శి ఎస్.రఘునాథ్ తెలిపారు. భాగ ఈ వతం – ప్రాశస్త్యం, గజేంద్ర మోక్షం, వామన చరిత్ర, అజా అజామిళోపాఖ్యానం, రంతి దేవుని కథ, ప్రహ్లాద చరిత్రపై కవి సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. సాహితీవేత్తల ధార్మిక ఉపన్యాసం ఉంటుందని వివరించారు.

March 26, 2026 / 09:12 AM IST

తిరుపతి గరుడ వారధిపై వెళుతున్నారా.?

TPT: గరుడ వారిధిపై ప్రయాణించే ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో నిర్ణయించారు. నిన్న తిరుపతి కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవిమనోహర్ చారి, ఆర్టీవో మురళీమోహన్ అధికారుల బృందం గరుడ వారధిపై జరుగుతున్న వరుస ప్రమాదాలపై సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

March 26, 2026 / 09:11 AM IST

స్టీల్ ప్లాంట్లో ప్రమాదం లేదు: మేనేజర్

KRNL: స్టీల్ ప్లాంట్‌లో ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్లాంట్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. మిషన్ షట్‌డౌన్ ప్రక్రియలో ఫీడర్ వాల్వ్ తెరవడంతో పొగ బయటకు వచ్చినట్లు వివరించారు. పొగ ఎక్కువగా కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారని పేర్కొన్నారు. ఇది సాధారణ సాంకేతిక ప్రక్రియలో భాగమేనని, అగ్ని ప్రమాదం లేదా పేలుడు జరగలేదన్నారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని వెల్లడించారు.

March 26, 2026 / 09:10 AM IST

ఐరాల, జీ నెల్లూరు పరిధిలో పోస్టులకు ఈనెల 28కి వాయిదా

CTR: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీకి బుధవారం ఆర్డీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. 187 హెల్పర్ పోస్టులకు 261 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐరాల, గంగాధరనెల్లూరు సీడీపీవో ప్రాజెక్టు పరిధిలోని పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను ఈ నెల 28కు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు గమనించాలన్నారు.

March 26, 2026 / 09:04 AM IST

లేబర్ కోడ్‌పై పరిశోధనకు గానూ చిట్టిబాబుకు పీహెచ్‌డీ

విశాఖకు చెందిన యూ. చిట్టిబాబు న్యాయ విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా బుధవారం వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ చేతుల మీదుగా ఆయన పట్టా స్వీకరించారు. ‘లేబర్ కోడ్-2020’ అంశంపై ఆచార్య డి. సూర్య ప్రకాశరావు పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గానూ ఈ పీహెచ్‌డీ లభించిందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందించారు.

March 26, 2026 / 09:03 AM IST

ఈనెల 30న వారపు సంత బహిరంగ వేలం

VZM: కొత్తవలస వారపు సంత 2026-27కు సంబంధించి ఈనెల 30 ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్.రమణయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఔత్సాహికులు గమనించి, వేలం పాటలో పాల్గొనాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు కార్యాలయ పనివేళ్లలో సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.

March 26, 2026 / 09:00 AM IST

నేడు నీలమణి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

SKLM: పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు ఇవాళ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వాసుదేవరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ ఛైర్మన్ సన్యాసిరావు, దేవాదాయ, రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో హుండీ లెక్కింపు జరుగుతుందన్నారు. ఆసక్తిగల భక్తులు పాల్గొనాలని కోరారు.

March 26, 2026 / 09:00 AM IST

బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఆలయ కమిటీ

PPM: సీతానగరం మండల కేంద్రంలో 250 ఏళ్ల చారిత్రక గల పురాతన శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 9 వరకు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలంటూ స్దానిక MLA బోనెల విజయ్‌ చంద్రను బుధవారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

March 26, 2026 / 09:00 AM IST

‘సహాయక చర్యలు ముమ్మరం చేయండి’

మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర జరిగిన బస్సు ప్రమాద ఘటనపై మంత్రి స్వామి కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి స్వామి అధికారులను ఆదేశించారు. బస్సులో 18 మంది వరకు ప్రయాణికులు సజీవ దహనం కావడం మనసును తీవ్రంగా కలిసి వేసిందని అన్నారు.

March 26, 2026 / 08:55 AM IST

శ్రీరామనవమి అన్నదానానికి విరాళం అందజేత

SS: ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్ శ్రీ జానకి రామ దేవాలయ శ్రీరామనవమి అన్నదాన కార్యక్రమానికి టీడీపీ యువ నాయకుడు సంధా రాఘవ రూ.10,000 విరాళం అందజేశారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఆయన, ఆలయ కమిటీ సభ్యులను అభినందిస్తూ భక్తులకు అన్నదానం చేయడం పుణ్యకార్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

March 26, 2026 / 08:48 AM IST

టెక్కలిలో ప్రభుత్వ పెట్రోల్ బంక్‌లో ఉద్యోగాలు

SKLM: టెక్కలిలోని ప్రభుత్వ ఫిలింగ్ స్టేషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు RDO కృష్ణమూర్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ అధీకృత ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌‌లో 2 మేనేజర్, 6 పంప్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 31 లోపు టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

March 26, 2026 / 08:40 AM IST