KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఏప్రిల్ 1న రాష్ట్ర స్థాయి గుర్రం పరుగు పందేలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చేబ్రోలు శివారునున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నివాసం పక్కనున్న అడవిపుంత మార్గంలో పందేలు జరుగుతాయన్నారు. సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని పందేలు ఏర్పాటు చేశామన్నారు.
NLR: సీతారామపురం గుండుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత రాచాల కొండలరావు కుటుంబానికి పార్టీ ప్రమాద భీమా కింద రూ. 5 లక్షల చెక్కును మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు, కూటమి నేతలు అందజేశారు. కార్యక్రమంలో యూత్ కన్వీనర్ పసుపులేటి వికాస్‌బాబు, గుండుపల్లి గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మెరిగ రవీంద్ర, కూత్రా రత్నయ్య, చంద్రారెడ్డి, జాషువా, ప్రసాద్, కిరణ్ పాల్గొన్నారు.
W.G: ఉండి బస్‌స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామక్షేత్రంలో నూతన శిఖర పునః ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ అతి వైభవంగా నిర్వహించారు. 72 సంవత్సరాలు క్రితం నిర్మించిన ఆలయ శిఖరం శిథిలావస్తకు చేరుకోవటంతో తిరిగి శిఖరం పునః ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి చక్రస్థానం, మహా పూర్ణాహుతి జరిపారు.
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో పురపాలక కమిషనర్ ఎన్. గంగిరెడ్డి ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం ఘనంగా ఇవాళ నిర్వహించారు. మున్సిపల్, మెప్మా, సచివాలయ సిబ్బంది కలిసి జీరో వేస్ట్ కలెక్షన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సోమప్ప సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఏలూరు జిల్లాలోని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసు బాబు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ శ్రీవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
SS: రాప్తాడు, హిందూపురం, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎంపీ బీకే పార్థసారథి అందజేశారు. మొత్తం రూ. 14,20,003 విలువైన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనారోగ్యం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేదలకు ఈ నిధి ఎంతో ఊరట కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం. విజయ సునీత నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మార్కాపురం జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇటీవల అనివార్య కారణాలవల్ల ఈ నెల 24 బాధ్యతలు స్వీకరణ వాయిదా పడిన విషయం తెలిసిందే.
సత్యసాయి: జిల్లాలో వంటగ్యాస్ కొరత కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో సరఫరా తగ్గి గృహ వినియోగదారులు, హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 46,536 సిలిండర్ల బుకింగ్‌లు ఉండగా, కేవలం 17,206 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పలుచోట్ల హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు.
CTR: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 1న ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ తెలిపారు. ఆయన ఆ సంఘం నేతలతో కలిసి కలెక్టరేట్‌లో డీఆర్వో మోహన్ కుమార్‌కు ముందస్తు నోటీసు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా హామీలు నెరవేర్చలేదన్నారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
ATP: తాడిపత్రి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ శివరామకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని, హాజరయ్యే వారికి స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 25న పాలిసెట్ పరీక్ష ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
NLR: ముత్తుకూరు మండల కేంద్రంలోని HP పెట్రోల్ బంక్ ఎదుట శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో రెండు వాహనాల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
EG: రాజమండ్రి కలెక్టరేట్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC)లో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన AssistantSurveyor కోర్సు శిక్షణా కార్యక్రమం శనివారం నిర్వహించారు. సర్వే ఇన్స్ట్రుమెంట్స్ చైన్ ,కాంపెస్, ప్లాన్ టాబ్లెట్ సర్వేయ్స్ , లెవెల్లింగ్ ఇన్స్ట్రుమెంట్స్, థియడోలితే, టోటల్ స్టేషన్‌తో ప్రాక్టికల్స్, థియరీ క్లాసులలో శిక్షణ ఇవ్వనున్నారు.
అనకాపల్లి: కోటవురట్ల మండలం కొడవటిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం విద్యార్థులతో ఉపాధ్యాయులు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి శనివారం పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కలిగించడంతో పాటు శ్రమదానంతో వ్యర్ధాలను తొలగిస్తున్నామన్నారు.
KKD: ప్రేమించానని చెప్పి బాలికను మోసగించి, అత్యాచారం చేసిన యువకుడిపై కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కాకినాడకి చెందిన బాలిక(17) తొమ్మిదో తరగతి వరకూ చదివి ఇంటి వద్దే ఉంటుంది. బాలికకు అనారోగ్య సమస్యతో శుక్రవారం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి ఆమె 16 వారాలు గర్భవతి అని చెప్పారు. బాలికను ప్రశ్నించగా విషయం బయటపడింది.
PPM: ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో శనివారం వజ్రప్రహార్ ఆపరేషన్‌లో భాగంగా రూరల్ సిఐ, బలిజిపేట ఎస్ఐ, ఎక్సైజ్ సిబ్బందితో కలిసి బాలగుడబలోని రెల్లి వీధిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 30 నాటు సారా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా అక్కడి స్థానికులచే మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.