• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అంబులెన్సులోనే ప్రసవం

ASR: కొయ్యూరు మండలం గరిమండ గ్రామానికి చెందిన మర్రి సుమిత్ర (29)కి శుక్రవారం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది అంబులెన్సులో వెంటనే అక్కడకు చేరుకున్నారు. గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో EMT లక్ష్మి, పైలెట్ హరి ప్రసాద్ ప్రసవం చేశారు. అనంతరం తల్లిబిడ్డలను ఆసుపత్రికి తరలించారు.

March 13, 2026 / 06:47 PM IST

వినతలు స్వీకరించిన ఎమ్మెల్యే

VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈమేరకు వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

March 13, 2026 / 06:47 PM IST

‘సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం’

KRNL: ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా వేదిక – గ్రీవెన్స్ డే కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను జ్యోతి దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో ఆమె ప్రతి ఒక్కరి అర్జీని శ్రద్ధగా విని స్వీకరించారు.

March 13, 2026 / 06:46 PM IST

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో రెండేళ్ల జైలు శిక్ష

CTR: ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. 2014 నవంబర్‌లో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి పది ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తూ తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్ రొంపిచర్ల మండలంలో పట్టుపడ్డారు. కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ. 20 వేల జరిమానా విధించింది.

March 13, 2026 / 06:45 PM IST

చాగల్లు మండలం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: చాగల్లు మండలం సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించి పలు సూచనలు ఇచ్చారు. అలాగే చాగల్లు మండల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. అనంతరం మండలంలో సర్పంచ్‌లను సన్మానించారు.

March 13, 2026 / 06:45 PM IST

‘గ్యాస్ సరఫరాలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు’

ATP: గుంతకల్లులోని గ్యాస్ గోడౌన్‌లను శుక్రవారం పౌర సరఫరాల డిప్యూటీ ఎమ్మార్వో సుబ్బలక్ష్మి తనిఖీ చేశారు. గోడౌన్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ల స్టాకును పరిశీలించారు. కలెక్టర్ సూచన మేరకు వినియోగదారులకు గ్యాస్ సరిపడా ఉండేలా చూడాలని తెలిపారు. గ్యాస్ సిలిండర్ సరఫరాల అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 13, 2026 / 06:44 PM IST

‘రైతు సంక్షేమమే ప్రాధాన్యం’

ASR: దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పాడేరులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్కో రైతుకు రూ.6,000 చొప్పున అల్లూరి జిల్లాలో 1,03,864 మంది రైతుల ఖాతాల్లో రూ.62.32 కోట్లు జమ అయినట్లు పేర్కొన్నారు.

March 13, 2026 / 06:41 PM IST

హరిపాలెంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్

AKP: అచ్యుతాపురం మండలం హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 14 సంవత్సరాలు నిండిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలికలు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

March 13, 2026 / 06:40 PM IST

ఘనంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం

AKP: నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం ఘనంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించే ఈ పథకం మూడవ విడత నిధుల పంపిణీని స్థానికంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

March 13, 2026 / 06:37 PM IST

పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం

తూ.గో జిల్లా పరిధిలోని రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ & పీఎం కిసాన్ యోజన పథకాల కింద గణనీయమైన ఆర్థిక సహాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిందని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడం జరిగిందన్నారు. వివిధ నియోజకవర్గాల పరిధిలో MLA, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

March 13, 2026 / 06:36 PM IST

ప్రజా సమస్యల వేదిక నిర్వహించిన ఎమ్మెల్యే

NDL: ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. పట్టణంలోని ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలు అధికారులను సంప్రదించినప్పుడు వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

March 13, 2026 / 06:36 PM IST

అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

AKP: పాయకరావుపేట నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద 39,302 మంది లబ్ధి పొందినట్లు వ్యవసాయ శాఖ ఏడీ ఉమా ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కోటవురట్లలో జరిగిన కార్యక్రమంలో రైతులకు చెక్కు అందజేశారు. మూడవ విడతలో రూ.21.67 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపారు. ఇందులో టీడీపీ నాయకులు లాలం కాశీనాయుడు, కొప్పిశెట్టి వెంకటేష్ పాల్గొన్నారు.

March 13, 2026 / 06:35 PM IST

సీఎంను కలిసిన టీడీపీ ఇంఛార్జ్

W.G: అమరావతి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబుని తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపి ఇంఛార్జ్ వలవల బాబ్జి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.

March 13, 2026 / 06:34 PM IST

‘రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలి’

VZM: జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు.

March 13, 2026 / 06:32 PM IST

‘క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో బినామీ పేర్లతో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్న మున్సిపాలిటీ ఉద్యోగి హరిపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

March 13, 2026 / 06:31 PM IST