TPT: నాయుడుపేట మున్సిపాలిటీలో అక్షర ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా అభ్యాసకులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ షేక్ పజులుల్లా సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. మొత్తం 2040 మంది అభ్యాసకులకు శిక్షణ ఇచ్చి పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
ELR: ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామసచివాలయ కార్యాలయానికి రక్షణ గోడ లేదు. ఈ భవనం నిర్మించినప్పుడు గేటు నిర్మించడం కోసం కార్యాలయానికి వెళ్లే రహదారిలో గోడ కట్టలేదు. ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా గేటు ఏర్పాటు చేయలేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సచివాలయానికి రక్షణగా గేటు ఏర్పాటు చేయాలని ప్రజల కోరుతున్నారు.
VZM: శృంగవరపుకోట మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి ఆదివారం అత్యంత వైభవంగా శంకుస్థాపన జరిగింది. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొని పూజలు చేశారు. ఇందులో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పరమపూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ఉన్నారు.
ASR: బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు పెళ్లి వద్దు” అనే కార్యక్రమాన్ని కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
PLD: ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భరోసా ఇచ్చారు. చీకటిగలపాలెం గ్రామానికి చెందిన రావూరి అనిత, ముప్పరాజువారిపాలెంకు చెందిన షేక్ చిన్నసాంబి కుటుంబాలను వారి కార్యాలయంలో పరామర్శించారు. బాధితులకు బియ్యం బస్తా, వంట సామాన్లు, బట్టలు ఆర్థిక సహాయంగా అందజేశారు.
అన్నమయ్య: రాజంపేట మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయనపల్లిలో కృష్ణవేణి మృతి కేసులో ఆమె భర్త శ్రీరామ్ శ్రీనివాసులును ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను వేధించడంతో పాటు ఆమె ఉరివేసుకుంటుండగా వీడియో తీస్తూ.. ప్రేరేపించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ATP: అనంతపురం నగరంలో ఇంటి, దుకాణాల పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడు తమ సిబ్బందికి ఆదేశించారు. దీంతో నార్పల గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఆదివారం కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి పన్నులు, షాప్ లైసెన్స్‌లు వసూలు చేస్తున్నారు. సకాలంలో ఇంటి పన్నులను చెల్లించాలని సూచించారు.
NDL: అవుకు పట్టణంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. నూతనంగా ఏర్పాటు చేసిన గౌడ కమ్యూనిటీ హాల్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం గౌడ కులస్తులు ఎల్లప్పుడూ ఐకమత్యంగా కలిసి ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
NLR: కలిగిరి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరవ తరగతి-40 సీట్లకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (MPHW- నర్సింగ్) గ్రూప్ – 40 సీట్లకు సంబంధించిన అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ K.సుప్రియ తెలియజేశారు. ఈ అడ్మిషన్స్ కోసం ఆన్‌లైన్‌లో KGBV సైట్‌లో అప్లై చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కేజీబీవీ విద్యాలయాన్ని సందర్శించాలని సూచించారు.
సత్యసాయి: హిందూపురంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హిందూపురం ఎంపీ పార్థసారథి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపు 90 కంపెనీల ప్రతినిధులు హాజరైనట్టు తెలిపారు.
ASR: అరకు నియోజకవర్గంలోని మాడగుడ గ్రామాన్ని ఈనెల 17న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించనున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ శెట్టి గంగాధర్ స్వామి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఆమె మాడగుడ గ్రామానికి చేరుకుంటారన్నారు. అనంతరం గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు సంబంధించిన అర్జీల వివరాలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అర్జీల స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చని చెప్పారు. సోమవారం అన్ని కార్యాలయాల్లో ప్రజల వినతులు స్వీకరించబడతాయని పేర్కొన్నారు.
KRNL: డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్ వ్యవస్థకు మచ్చ తెచ్చారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ‘తనకు ఓటు వేయండి’ ‘డ్రగ్స్ నిర్మూలిస్తాం’ అని చెప్పి డ్రగ్స్ మత్తులో దొరికిపోయాడన్నారు.
KDP: టెన్త్ పరీక్షల నేపథ్యంలో ఖాజీపేటలోని అన్ని జిరాక్స్ సెంటర్ల యజమానులకు ఆదివారం పోలీస్ స్టేషన్‌లో SI వంశీధర్ సమావేశం నిర్వహించారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లేదా ఎలాంటి పరీక్షా మెటీరియల్ జిరాక్స్ తీయకూడదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్ యజమానులు నిబంధనలు పాటించాలన్నారు. నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
విజయనగరం జిల్లా PRTU 5వ జిల్లా కార్యనిర్వహక వర్గ సమావేశం గజపతినగరంలో ఆదివారం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు పాల్గొని ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం తీర్చాలన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే నిరసన చేపడతామన్నారు.