CTR: నగరి మున్సిపాలిటీ పాండురాజు పురం నందు శ్రీ విజయగణపతి ఆలయ కుంభాభిషేకం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ELR: ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షించారు. అలాగే రైతుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
NLR: నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ ప్రణాళిక పెండింగ్ ఫైళ్లను తక్షణమే క్లియర్ చేయాలని కమిషనర్ వై.ఓ నందన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నక్ష సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సర్వేలో 30% కన్నా తక్కువ పురోగతి ఉన్న సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
VZM: గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విజయనగరంలో శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. కన్యాకాపరమేశ్వరి ఆలయం జంక్షన్ వద్ద గ్యాస్ బండను తలపై పెట్టుకుని ఆందోళన నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ.. గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
ASR: ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చలపతిరావు తెలిపారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన “30 రోజుల ఇంగ్లీష్ కమ్యునికేషన్ స్కిల్స్” శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ శిక్షణలో తెలిపిన చిట్కాలను ప్రతిరోజు పాటిస్తే ఇంగ్లీష్ కమ్యునికేషన్ మెరుగుపడుతుందని అన్నారు.
W.G: ఉండి AMC నగదు పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది సీఎం చంద్రబాబుకు రైతులంటే చాలా ఇష్టమని, మన జిల్లా చూస్తే 65 శాతం ఆదాయం రైతుల నుంచే వస్తుంది అన్నారు. ఏ రాష్ట్రం ఇలా ఇవ్వటం లేదన్నారు.
KDP: రాజంపేటలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రేపు (మార్చి 14) ఘనంగా నిర్వహించనున్నారు. రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంఛార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మన్నూరు యల్లటూరు భవన్‌లో ఉదయం 10 గంటలకు పార్టీ పతాక ఆవిష్కరణ, మధ్యాహ్నం 12 గంటలకు అన్న క్యాంటీన్‌లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.
గుంటూరు SVN కాలనీ మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు SVN కాలనీ, గుజ్జనగుండ్లలోని కొంత ప్రాంతంనకు విద్యుత్త్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ టౌన్ ఏఈ పి. హుస్సేన్ ఖాన్, డీఏఈ ఎన్. గురవయ్య తెలిపారు.
PLD: నకరికల్లు మండలంలో రెండో శనివారం నిర్వహణ పనుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని సబ్ స్టేషన్ పరిధిలో 33 కేవీ, 11 కేవీ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వినియోగదారులు సహకరించాలని సూచించారు.
TPT: గ్యాస్ కొరతల నేపథ్యంలో తిరుపతిలో అధికారులు తనిఖీలు నిర్వహింస్తున్నారు. ఈ క్రమంలో సదరన్ స్పైస్ హోటల్ సమీపంలోని శ్రీబాలాజీ కోఆపరేటివ్ భారత్ గ్యాస్ గోడౌన్‌కు అనుమతులు లేవని గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 592 కమర్షియల్, 230 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల(మొత్తం 822)ను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ నిర్వహణకు అనుమతి లేకపోయినా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు.
ప్రకాశం: ఐక్య పోరాటాలతో కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. కల్పన తెలియజేశారు. శుక్రవారం కనిగిరి సీఐటీయూ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్, అంగన్వాడి, ఆశ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.
VZM: గుంకలాం జగనన్న కాలనీలో మంచినీరు, వీధి లైట్లు సహా మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే పెద్ద కాలనీల్లో ఒకటైన గుంకలాం జగనన్న కాలనీలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
VZM: కొత్తవలస కూడలిలో ఎస్సై ఎన్.జోగారావు సిబ్బందితో శుక్రవారం ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ట్రిబుల్ రైడింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహన తనిఖీల్లో పత్రాలు వెంట ఉండాలన్నారు. తనిఖీ సమయంలో సిబ్బందికి సహకరించాలని కోరారు.
TPT: హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో గల శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు పుష్పమాల, ఫలాలు, శాలువాతో సత్కరించారు. అనంతరం వేద పండితుల వేదాశీర్వచనాలు అందించారు. తర్వాత వేద పండితులు, విద్యార్థులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
KKD: పేద ప్రజల కోసమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని వైఎస్ షర్మిల తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిల జగ్గంపేట నియోజకవర్గం కాట్రావులపల్లి రచ్చబండలో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా జాతిపిత మహాత్మ గాంధీజీ పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం పేరును నేటి పాలకులు మార్చి వేయటం దారుణం అన్నారు.