• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఇళ్ల పట్టాల భూములను పరిశీలించిన మంత్రి

నంద్యాల: అవుకు మెట్ట ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి గుర్తించిన భూములను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన ఇవాళ తెలిపారు. భూముల బదలాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేసి సుమారు 3,500 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

March 15, 2026 / 12:13 PM IST

రేపు కర్నూలు నగరపాలకలో PGRS

KRNL: ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కర్నూలు నగరపాలకలో నిర్వహిసంచనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు పురోగతిని పౌరులు https://Meekosam.ap gov.in వెబ్‌సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చని కమిషనర్ వివరించారు.

March 15, 2026 / 12:11 PM IST

టమాటా పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

KRNL: గోనెగండ్ల మండలం ఒంటెదుదిన్నె గ్రామంలో సాగులో ఉన్న టమాటా పంట పొలాలను ఎమ్మిగనూరు నియోజకవర్గ MLA జయనాగేశ్వర రెడ్డి ఇవాళ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట పరిస్థితులు, సాగు ఖర్చులు, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరలపై వివరాలు తెలుసుకున్నారు. ధరలు తగ్గిపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు MLA దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

March 15, 2026 / 12:09 PM IST

‘రేపు కలెక్టరేట్‌లో గ్రివెన్స్ డే’

CTR: జిల్లా కలెక్టరేట్‌లో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

March 15, 2026 / 12:08 PM IST

శ్రీశైలం పాదయాత్రలో కన్నడ భక్తుడు మృతి

నంద్యాల: ఆత్మకూరు మండలం కృష్ణాపురం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన విజయ్ కుమార్ బరాది (38) పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్తుండగా ఎండ వేడిమి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యాడు. కృష్ణాపురం వద్ద సేదతీరుతున్న సమయంలో అతడు మృతి చెందగా, ఇవాళ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేసి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

March 15, 2026 / 12:08 PM IST

జిల్లా వైసీపీ పరిశీలకుల నియామకం

E.G: జిల్లా వైసీపీ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి నూతన పరిశీలకులను ఆదివారం నియమించింది. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా గొoదేశి శ్రీనివాసరెడ్డి, అనపర్తి తులసి కుమార్, రాజానగరం చందన నాగేశ్వర్, నిడదవోలు గిరజాలబాబు, గోపాలపురం తోట రామకృష్ణ, రాజమండ్రి సిటీ అద్దంకి ముక్తేశ్వరరావు నియమితులయ్యారు. ఈ నియామకంపై పార్టీ శ్రేణులు హర్షo వ్యక్తo చేశారు.

March 15, 2026 / 12:06 PM IST

సింగరాయకొండలో పర్యటించిన సీఐ

ప్రకాశం: సింగరాయకొండ లో దొంగతనాల నేపథ్యంలో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి CI హజరత్తయ్య సిబ్బందితో గ్రామంలో పలుచోట్ల పర్యటించారు. స్థానికులతో మాట్లాడి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. CC కెమెరాలతో నిఘా పెంచామని వారిలో ధైర్యం నింపారు.

March 15, 2026 / 12:06 PM IST

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో విశేష పూజలు

సత్యసాయి: పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామ పంచాయతీలోని శ్రీ సద్గురు షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయంలో సాయి భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నదానం చేశారు.

March 15, 2026 / 12:02 PM IST

ఏ.కోడూరులో PACS పెట్రోల్ బంక్ ప్రారంభం

AKP: కె.కోటపాడు మండలం ఏ.కోడూరులో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ఆదివారం ప్రారంభించారు. DCCB ఛైర్మన్ కోన తాతారావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభోత్సవం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 15, 2026 / 12:01 PM IST

‘వైసీపీ నాయకులు నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు’

NTR: విజయవాడ వెటర్నరీ కాలనీ యూత్ హాస్టల్ ఖాళీ స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని ఆదివారం పరిశీలించారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. కానీ కార్పొరేషన్ పాలకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.

March 15, 2026 / 11:59 AM IST

నెల్లిమర్లలో పకడ్బందీగా ఉల్లాస్ పరీక్షలు

VZM: నెల్లిమర్ల మండలంలో ఇవాళ పలు కేంద్రాల్లో ఉల్లాస్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నిరక్షరాస్యులైన వయోజనులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను MEO త్రినాథరావు పరిశీలించారు. నిర్వహణ తీరును పరిశీలించి, పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో CRP నాయుడు, వెలుగు, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు.

March 15, 2026 / 11:56 AM IST

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

ప్రకాశం: ఉగాది పండగను పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకోసం మార్కాపురం జిల్లా నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు DM లావణ్య తెలిపారు. మార్చి 19వ తేదీ ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా సుమారు 25 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రద్దీని బట్టి బస్సు సర్వీసులను పెంచే అవకాశం ఉందన్నారు.

March 15, 2026 / 11:56 AM IST

‘మొవ్వలో ఆక్రమణలను తొలగించాలి’

కృష్ణా: మొవ్వ మండలం కూచిపూడి గ్రామాన్ని స్వచ్ఛ సుందర కూచిపూడిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గ్రామస్థులు సహకరించాలని అధికారులు ఈరోజు సూచించారు. కూచిపూడి గ్రామంలోని పసుమర్తి ధర్మచెరువు పరిసరాలు, ఆర్ అండ్ బీ రోడ్డు పక్కన జరిగిన ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని కూచిపూడి ఎస్సై సురేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అంకబాబు కోరారు.

March 15, 2026 / 11:55 AM IST

గుత్తి కోట ఉత్సవాల వద్ద డ్రోన్ కెమెరాతో నిఘా

ATP: గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో రెండో రోజు ఆదివారం జరుగుతున్న గుత్తి కోట ఉత్సవాలలో భాగంగా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు కోట ఉత్సవాల పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసి క్షుణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

March 15, 2026 / 11:55 AM IST

పండుగలు వస్తున్నాయ్.. నిలిచిన కందిపప్పు

ELR: చౌకధరల దుకాణాల్లో పేదలకు ఇవ్వాల్సిన కందిపప్పు పంపిణీ ఏడాదికి పైగా నిలిచిపోయింది. ఏలూరు జిల్లాలో 1164 డిపోలలో 6.40 లక్షల కార్డుదారులు ఉండగా వారిలో ఎక్కువ మంది రేషన్ సరకులపైనే ఆధారపడుతున్నారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండగల సమయంలోనూ కందిపప్పు ఇవ్వకపోవడంతో కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా చౌక దుకాణాల్లో కేజీ రూ.67 ఉంది.

March 15, 2026 / 11:54 AM IST