• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘క్యాన్సర్ రహిత సమాజం కోసం పాటుపడదాం’

NLR: మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటని కోవూరు ఎమ్మెల్యే, TTD పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇవాళ తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్‌లోని పద్మావతి ఆడిటోరియంలో బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. క్యాన్సర్ రహిత సమాజం కోసం అందరం పాటు పడదాం అన్నారు.

March 15, 2026 / 05:32 PM IST

రేపటి నుంచి రైతన్న-మీ కోసం

AKP: జిల్లాలో ఈనెల 16 నుంచి రైతన్న-మీకోసం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. నీటీ భద్రత, డిమాండ్ ఆధారిత వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత, ఆహార శుద్ధి, ప్రభుత్వ సహకారం ప్రదాన అంశాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు రాబోయే ఎల్ నినోపై సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

March 15, 2026 / 05:29 PM IST

కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

PLD: విజయవాడ నుంచి అమరావతి వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముందు టైరు పంచర్ కావడంతో రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమరావతిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

March 15, 2026 / 05:28 PM IST

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

NDL: అవుకు పట్టణంలో ఇవాళ జనసేన నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రక్తం ఇచ్చిన వారికి మంత్రి సర్టిఫికెట్లను అందజేశారు.

March 15, 2026 / 05:27 PM IST

ఇంకా తెలియని మృతుడి ఆచూసి

ప్రకాశం: జరుగుమల్లి(మం) కేబిట్రగుంట గ్రామసమీపంలోని పాలేరువాగులో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. మృత దేహంను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలురిమ్స్‌కు తరలించారు. మృతుడి వివరాలు తెలియక పోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో SMలో, ఇతరపోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు.

March 15, 2026 / 05:26 PM IST

మృతురాలి కుటుంబానికి జనసైనికుల భరోసా..!

E.G: నల్లజర్ల మండలం అయ్యవరంలో జనసేన నాయకులు మానవత్వం చాటుకున్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన పాము వెంకటలక్ష్మి కుటుంబానికి ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. సొసైటీ డైరెక్టర్ గుడిసె శివకృష్ణ ఆధ్వర్యంలో రూ.20 వేల నగదును దొడ్డిగర్ల సువర్ణరాజు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండబాబు, బాపిరాజు పాల్గొన్నారు.

March 15, 2026 / 05:26 PM IST

రేపు వేములలో ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమం

KDP: వేములలో సోమవారం రైతన్న మీ కోసం నిర్వహిస్తున్నట్లు ఏfy ఓబులేసు ఆదివారం తెలపారు. మండలంలో 6,224 మంది రైతులకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18 వరకు, 23 నుంచి 25 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

March 15, 2026 / 05:25 PM IST

రేపటి నుంచి ప్రత్తిపాడులో ‘రైతన్న సేవలో’ కార్యక్రమం

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలో సోమవారం నుంచి ఆరు రోజుల పాటు ‘రైతన్న సేవలో’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బీ. రామాంజనేయులు తెలిపారు. ప్రతి రైతును కలిసి కూటమి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని ఆదివారం ఆయన పేర్కొన్నారు. గుంటూరు విద్యానగర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

March 15, 2026 / 05:25 PM IST

మాజీ ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలోకి చేరికలు

SKLM: జి.సిగడాం మండలం దేవరవలస గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు వైసీపీలో ఆదివారం చేరారు. మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాకర్ల నీలకంఠం నేతృత్వంలో పది కుటుంబాలు పార్టీలో చేరాయి. వైఎస్ జగన్‌ని, గొర్లె కిరణ్ కుమార్‌ని బలపరుస్తామని వారు తెలిపారు.

March 15, 2026 / 05:22 PM IST

ఏలూరు ఎంపీకి స్టేషన్ బెయిల్

ELR: మెయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు స్టేషన్ బెయిల్ లభించింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయనకు, ప్రియాంక రెడ్డికి నోటీసులు జారీ చేసి బెయిల్ మంజూరు చేశారు. శనివారం రాత్రి ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీని శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.

March 15, 2026 / 05:20 PM IST

‘నేత్రదానం మరొక వ్యక్తికి జీవిత ప్రసాదం’

VZM: చీపురుపల్లి ఆంజనేయపురంకి చెందిన గుడ్ల శ్యామసుందర్ (70) ఆస్తమా వలన ఆదివారం మరణించారు. అయన భార్య గుడ్ల రమణమ్మ, కుమార్తెలకి మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గోవిందరాజులు నేత్రదానంపై అవగాహన పరిచారు. వారు నేత్రదానం చేయడానికి అంగీకరించడంతో టెక్నీషియన్ వచ్చి ఆయన కార్నియాను సేకరించి విశాఖపట్నం హాస్పిటల్‌కి తరలించారు.

March 15, 2026 / 05:19 PM IST

పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించండి: మేయర్

NLR: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమవుతున్న పదవ తరగతి పరీక్షలలో నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ పాఠశాలలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా మేయర్ విద్యార్థులకు ఆశీస్సులను అందజేశారు. విద్యర్థులు ఎంతో కీలకమైన పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.

March 15, 2026 / 05:19 PM IST

పార్టీ బలోపేతమే లక్ష్యం: మాజీ మంత్రి

అన్నమయ్య:  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలో రాష్ట్ర ఎంపీపీల సంఘం ఉపాధ్య క్షుడు రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో వీరబల్లి మండల రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై చర్చించారు. గొడ్డిండ్ల వాండ్లపల్లి గ్రామస్థులు తమ సమస్యలను పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని తెలిపారు.

March 15, 2026 / 05:18 PM IST

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

PPM: నీలకంఠాపురం మండలంలోని పనసబద్ర గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను నీలకంఠాపురం ఎస్సై నీలకంఠారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్విన్‌పేట సీఐ హరి బాబు, పోలీసు సిబ్బందితో కలిసి టోర్నమెంట్ నిర్వాహకులకు క్రికెట్ బ్యాట్, వికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.

March 15, 2026 / 05:17 PM IST

పాఠశాల పైకప్పు నిర్మాణానికి పరిటాల శ్రీరామ్ హామీ

సత్యసాయి: ముదిగుబ్బ మండలం దొరిగల్లులో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చూసి ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్‌ స్పందించారు. పాఠశాల భవనాలు అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులు చెట్ల కింద చదువుకుంటున్నారని తెలుసుకున్న ఆయన ఆదివారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. తన సొంత ఖర్చుతో పాఠశాలపై కప్పు నిర్మాణం చేపడతానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

March 15, 2026 / 05:17 PM IST