SKLM: జి.సిగడాం మండలం దేవరవలస గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు వైసీపీలో ఆదివారం చేరారు. మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాకర్ల నీలకంఠం నేతృత్వంలో పది కుటుంబాలు పార్టీలో చేరాయి. వైఎస్ జగన్ని, గొర్లె కిరణ్ కుమార్ని బలపరుస్తామని వారు తెలిపారు.