E.G: నల్లజర్ల మండలం అయ్యవరంలో జనసేన నాయకులు మానవత్వం చాటుకున్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన పాము వెంకటలక్ష్మి కుటుంబానికి ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. సొసైటీ డైరెక్టర్ గుడిసె శివకృష్ణ ఆధ్వర్యంలో రూ.20 వేల నగదును దొడ్డిగర్ల సువర్ణరాజు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండబాబు, బాపిరాజు పాల్గొన్నారు.