• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు

W.G: ఉండి బస్ స్టాండ్ ఎదురుగా శ్రీ రామక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఇవాళ ఘనంగా ఆలయ అధికారులు ప్రారంభించారు. పుజారులు సీతమ్మవారిని పెండ్లికుమార్తెగా, శ్రీరాముడిని పెండ్లికుమారుడుగా అలంకరించారు. రేపు ఉదయం సీతారామ కళ్యాణ్యం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.

March 26, 2026 / 12:05 PM IST

‘సమస్య మీది.. పరిష్కారం మాది’

KDP: జిల్లాలో ‘సమస్య మీది – పరిష్కారం మాది’ నినాదంతో రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఇంటింటి పర్యటన చేపట్టారు. ఈడిగపాలెం వార్డు-2లో ప్రజల సమస్యలు తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 26, 2026 / 12:04 PM IST

బస్సులో ప్రయాణికుల వివరాలు ఇవే..!

మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర గురువారం తెల్లవారుజామున ఉదయం జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణించిన వారి వివరాలు వెళ్లడయ్యాయి. ఈ చార్ట్‌ను పరిశీలిస్తే మృతులంతా 30 ఏళ్లలోపువారే కావటం దురదృష్టకరమని పలువురు పేర్కొంటున్నారు. అధికంగా జగిత్యాల, నిర్మల్, కోరుట్ల ప్రాంతాల నుంచి వలస వెళ్లిన వారు తిరిగి పామూరు, కనిగిరి, వింజమూరు, ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది.

March 26, 2026 / 12:02 PM IST

లంకమ్మ జాతర పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డ గ్రామ దేవత శ్రీ లంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గురువారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అమ్మవారి ఉత్సవాల పోస్టర్లను ధర్మకర్తలు ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందించి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.

March 26, 2026 / 12:01 PM IST

కలెక్టర్‌ను కలిసిన ఆర్డీవోగా కె.బాలకృష్ణ బాధ్యతలు

PLD: నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో)గా కె.బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పాలన వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆర్డీవో కె.బాలకృష్ణ తెలిపారు.

March 26, 2026 / 12:01 PM IST

ఐస్ ప్లాంట్‌లో స్లాబ్ కూలి కార్మికుడు మృతి

విశాఖపట్నంలోని మరకవలస ప్రాంతంలోని హిమాద్రి ఐస్ ప్లాంట్‌లో ఇవాళ ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న సమయంలో స్లాబ్ కూలిపోవడంతో పీతల గోవింద్ (52) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు త‌ర‌లించారు.

March 26, 2026 / 12:00 PM IST

లబ్ధిదారుల గుర్తింపుకు మత్స్య శాఖ సర్వే

AKP: మత్స్యకార భరోసా పథకం కింద లబ్ధిదారుల గుర్తింపుకు గురువారం నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు మత్స్యకార గ్రామాల్లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో అధికారులు సర్వే ప్రారంభించారు. ఏప్రిల్ 15 నుంచి‌ జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో ‌ వేట నిషేధ సమయంలో ‌ మత్స్యకారులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. ఈ సహాయానికి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు.

March 26, 2026 / 12:00 PM IST

ఉచిత ఆక్యుప్రెజర్ శిబిరాన్ని సందర్శించిన ఆర్డీవో

SS: పుట్టపర్తిలోని పెద్దబజార్ ఎంపీపీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత ఆక్యుప్రెజర్, రిఫ్లెక్సాలజీ శిబిరం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్డవో సువర్ణ సందర్శించి నిర్వాహకుల సేవలను అభినందించారు. నటరాజ్ నేతృత్వంలోని నిపుణుల బృందం, యోగా శిక్షకుడు నారాయణరెడ్డి ప్రజలకు ఉచితంగా ఆరోగ్య మెళకువలు అందిస్తున్నారని కొనియాడారు.

March 26, 2026 / 12:00 PM IST

తాళాలు పగలగొట్టి నగదు మాయం చేసిన దుండగులు

SKLM: ఆమదాలవలసలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లోని విశాఖ డెయిరీలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. షాప్ తాళాలు పగలగొట్టి రూ.15 వేల వరకు దొంగలించినట్లు బాధితులు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బాలరాజు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలో వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

March 26, 2026 / 12:00 PM IST

సమాజ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఎమ్మెల్యే

E.G: సమాజ సేవ చేసేందుకు బాధ్యత కలిగిన పౌరులు ముందుకు రావాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నర్సీపట్నం మండలం రావికవతంలోని పీహెచ్‌సీలో వైద్యురాలిగా పని చేసి రిటైర్డ్ అయిన వేమన కళావతి ఆమె దాచుకున్న దానిలోంచి పేదలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో రూ. 5 లక్షలు కేటాయించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో సదరు చెక్కును ఆమె అందజేశారు.

March 26, 2026 / 11:59 AM IST

రైలు కింద పడి యువకుడు మృతి

ATP: గుత్తి పట్టణ శివారులో గురువారం ఓ గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు కిందకు వెళ్లి ప్రాణాలు తీసుకున్నట్లు జీఆర్పీ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. మృతుడి వివరాలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై GRP పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 26, 2026 / 11:59 AM IST

భద్రాచలం పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: వైసీపీ పాలన ముగిసి కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్న మొక్కులో భాగంగా కొవ్వూరులో చాగల్లు ప్రాంతం భక్తులు చేపట్టిన పాదయాత్రను గురువారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. గత 10–12 సంవత్సరాలుగా జిల్లాలోని కొవ్వూరు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి అనేకమంది భక్తులు పాదయాత్రగా భద్రాచలం వెలుతుంటారు.

March 26, 2026 / 11:56 AM IST

గడ్డివాముకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

ATP: పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పు పెట్టిన ఘటన గురువారం జరిగింది. గ్రామానికి చెందిన దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి పశుగ్రాసం కోసం వీటిని ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 26, 2026 / 11:55 AM IST

ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా జడ్పీ చైర్‌పర్సన్

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదం స్థలానికి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ చేరుకున్నారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.

March 26, 2026 / 11:41 AM IST

బస్సు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

NDL: మార్కాపురం జిల్లాలో ఇవాళ జరిగిన బస్సు, టిప్పర్ ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుని పదిమంది ప్రయాణికులు సజీవ దహనం కావడంపై ఆయన ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

March 26, 2026 / 11:39 AM IST