GNTR: తాడేపల్లిలోని సీతానగరం బోట్ యార్డ్ వద్ద గల బకింగ్ హమ్ కాలువ సమీపంలోని చెట్లల్లో ఓ వ్యక్తి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.మృతుడు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన తిరుమల కొండలు (45)గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
KDP: సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ZP పాఠశాలలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SI అనిల్ కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి, మత్తు మందులు, గుట్కాలు ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. బ్యాంకు ఖాతా, ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీ వివరాలను ఎవరికీ చెప్పొద్దని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని విద్యార్థులకు సూచించారు.
అనకాపల్లి పట్టణం నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఫోరం ఫర్ బెటర్ ఇండియా అధ్యక్షుడు జి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్‌కు వినతి పత్రం అందజేశారు. కనీసం పార్కింగ్ ఏర్పాటుకు స్థలం కూడా లేని ప్రాంతంలో బారు నిర్వహణకు ఎలా అనుమతులు మంజూరు చేశారని ప్రశ్నించారు.
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉదయం 8 గంటలు వరకు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్ పరిధిలో పలు రకాల కార్యక్రమంలో పాల్గొంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాష్ట్ర ఐటిడిపి ఉపాధ్యక్షులు రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు గురువారం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పూలమాలలు, శాలువాలతో సన్మానించి, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాష్ట్ర ఐటిడిపి ఉపాధ్యక్షులు రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు గురువారం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పూలమాలలు, శాలువాలతో సన్మానించి, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
VSP: మధురవాడ సబ్‌స్టేషన్ పరిధి చంద్రంపాలెం 11KV ఫీడర్‌పై ఫుట్ బ్రిడ్జి పనుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జోన్-3 ఏఈ సింహాచలం నాయుడు తెలిపారు. చంద్రంపాలెం, మధురవాడ మెయిన్ రోడ్, దుర్గ నగర్-1, దుర్గ నగర్-2, కృష్ణ నగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
PPM: వంగర మండలంలోని రుషింగిలో దుర్గా షిరిడిసాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 22వ తేదీన ఉత్త రాంధ్ర స్థాయి కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. టీం వివరాలు నమోదు కొరకు 8309487836 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
KDP: పులివెందుల పట్టణంలో ఈ నెల 22వ తేదీ నుంచి విద్యార్థులకు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు పీఈటీలు ప్రభాకర్, రవికుమార్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. పులివెందుల స్థానిక న్యాక్ బిల్డింగ్ సమీపంలో ఉన్న సత్రం బడి ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.
KDP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీసులను కడప జిల్లా SP ఆదేశించారు. గురువారం జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళా భద్రత, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రౌడీషీటర్లపై నిఘా పెంచాలని, మట్కా, బెట్టింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
KDP: పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్త సిద్ధారెడ్డిపై భార్య సుహాసిని సహనం కోల్పోయి, గొడ్డలితో గొంతునరికి హత్య చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. CI చల్లని దొర, ఎస్సై తులసి నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్త సిద్ధారెడ్డిపై భార్య సుహాసిని సహనం కోల్పోయి, గొడ్డలితో గొంతునరికి హత్య చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. CI చల్లని దొర, ఎస్సై తులసి నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ జాతర 3 రోజుల హుండీ లెక్కింపు గురువారం పూర్తయింది. ఈ లెక్కింపు ప్రకారం మొత్తం రూ.17, 96,420 ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాకు జమ చేయనున్నారు. ఆలయ సిబ్బంది, పూజారులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు ఇచ్చిన సహకారం ఆలయ నిర్వహణకు, పూజా కార్యక్రమాల కోసం ఉపయోగపడనుందని ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు.
KRNL: నందవరం SC కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో పుల్లయ్య తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తోందని, ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు. పాఠశాలలోని స్టాక్ రిజిస్టర్, హోమ్ డెలివరీ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
KRNL: పత్తికొండ మండలంలో రైతు విశిష్ట సంఖ్య ఉంటేనే కిసాన్ పథకం వర్తిస్తుందని మండల వ్యవసాయ అధికారి వెంకట్రాముడు బుధవారం తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన 2,143 మంది రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించినట్లు చెప్పారు. నమోదు లేని రైతులు వెంటనే తమ గ్రామ రైతు సేవా కేంద్రాలను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు.