సత్యసాయి: అమరావతి సచివాలయంలో ‘మిషన్ హెల్తీ భారత్’ యాత్ర నిర్వహిస్తున్న యువతి తాప్సీ ఉపాధ్యాయను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం సత్కరించారు. మీరట్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ యాత్ర ద్వారా ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 17,400 కిలోమీటర్లు ప్రయాణించి, ఊబకాయంపై అవగాహన కల్పించినట్లు ఆమె వివరించారు.
ATP: మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంఛార్జ్‌లకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొని దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంలో క్లస్టర్ ఇంఛార్జ్‌ల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా కృషి చేయాలని సూచించారు.
ప్రకాశం: ఒంగోలులోని ప్రకాశం భవన్లో జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిని గురువారం సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్.విజయకుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గల గుండ్లకమ్మ ప్రాజెక్టు పునరావాస కేంద్రాల అభివృద్ధి గురించి జేసీతో చర్చించారు. అలాగే పలు రెవిన్యూ సమస్యలను జేసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
ATP: గుంతకల్లులోని కసాపురం రోడ్డులో గురువారం సొసైటీ బ్యాంకు ఛైర్మన్ తలారి మస్తానప్ప ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ..వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన దాతలను వారు అభినందించారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలన్నారు.
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో కొనకల మెట్ల మండలం పెదారికట్ట గ్రామానికి చెందిన అంబటి అనిల్, అతని 5 నెలల కుమారుడు బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. స్వగ్రామమైన పెదారికట్టకు తన కుమారుడికి బారసాల చేసేందుకు వస్తుండగా బస్సులో అగ్నికి ఆహుతి అయ్యాడని అనిల్, చిన్నారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
PLD: శ్రీరామనవమి పురస్కరించుకుని నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లకు రంగం సిద్ధమైంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, భారీ విద్యుత్ ప్రభలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రేపు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరగనున్నాయి. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ అన్ని మౌలిక వసతులు కల్పించింది.
బాపట్ల పట్టణంలో డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగును వెంటనే తొలగించాలని కమిషనర్ రఘునాథరెడ్డి సూచించారు. గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. అంబేద్కర్ భవన్ రోడ్డులో పేరుకుపోయిన మురుగుపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి ప్రవాహం ఎప్పుడూ నిరాటంకంగా ఉండేలా సిబ్బందికి సూచించారు.
PLD: సత్తెనపల్లి నియోజకవర్గం ఫనిదేం గ్రామంలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని సందర్శించి, రైతులతో మమేకమయ్యారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
VZM: నిర్దేశించిన కాల పరిమితిలో ఇంటి పన్నులు వసూలు చేయాలని DLPO ఉషారాణి ఆదేశించారు. గురువారం కొత్తవలస, ఎస్.కోట మండలాల్లో ఆమె సుడిగాలి పర్యటన చేశారు. MPDO, Dy MPDO, పంచాయితీ సిబ్బందితో పాటు శానిటరీ మేస్తీలు కూడా టాక్స్, నాన్ టాక్స్ ఈనెల 31 లోపు లక్ష్యాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు.
NDL: శ్రీశైలం మండలం సున్నిపెంట అక్కమ్మ సెంటర్ సమీపంలో నివసిస్తున్న నవీన్ (48) గురువారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తలకు గాయం ఉండటంతో దాడి చేసి చంపారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సీఐ గంటా సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
TPT: నారాయణవనం మండలం తుంబూరు గ్రామపంచాయతీలో ఫిషరీస్ పాండ్ పనులను గురువారం పథక సంచాలకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులకు రోజుకు రూ.307 వేతనం అందే విధంగా పనులకు సరైన మార్కింగ్ ఇచ్చి క్రమబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి శ్రామికుడు వంద రోజుల ఉపాధిని పూర్తి చేసుకోవాలని కూడా సూచించారు.
GNTR: అమరావతిలో ఈ నెల 11న L&T, 23న మెగా ఇంజినీరింగ్ కంపెనీల వద్ద జరిగిన అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం ప్రత్యేక బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో బృందం పనిచేయనుంది. బృందంలో నలుగురు SIలు, నలుగురు Clలు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. ఘటనలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో తుళ్లూరు CI, DSP ఉన్నట్లు సమాచారం.
KRNL: గోనెగండ్లకు చెందిన యువకుడు పోలకల్ రాజ్ కుమార్ తన అభిమానానికి వినూత్న రూపం ఇచ్చాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు పర్వత శిఖరంపై గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఫోటోను ప్రదర్శించాడు. మైనస్ ఉష్ణోగ్రతల్లో చూపిన ఈ సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
AKP: అచ్యుతాపురం మండలం మోసయ్యపేట గ్రామంలో గురువారం శ్రీసీతారాముల కళ్యాణరాట కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో రాట వేశారు. మహిళలు మంగళహారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు జరిగే శ్రీరామనవమిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.
TPT: సత్యవేడు (M) NRఅగ్రహారంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హేమావతికి కొద్ది రోజుల కిందట ఆడబిడ్డ పుట్టింది. అయితే ఇవాళ ఆమె కూతురుని చంపేసింది. బిడ్డ తరుచూ పాల కోసం ఏడుస్తూ ఉండడంతో నచ్చక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితురాలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.