KRNL: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడం పట్ల విచారం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.