VSP: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ పరిధిలోని మాంసం దుకాణాలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. నగరంలో మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలు నిషేధించినట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్‌వి నరేష్ కుమార్ తెలిపారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సత్యసాయి: జిల్లా SP సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శక్తి టీమ్ బృందాలు మహిళలు, బాలికల భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. ఆపద సమయంలో శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని గురువారం నిర్వహించిన సదస్సులో పోలీసులు వివరించారు. పోక్సో చట్టం, సైబర్ నేరాలు, గృహ హింసపై అవగాహన కల్పిస్తూ డయల్ 100, 112, 181 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
AKP: జిల్లాలో అభివృద్ధికి బీజం వేసింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. గురువారం నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కరువు నివారణకు ఎస్ఈజెడ్‌ను వైఎస్ఆర్ తీసుకువచ్చిన విషయాన్ని స్థానిక టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. అలాగే, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదిత్యా మిట్టల్‌ను జగన్ ఆహ్వానించారన్నారు.
SKLM: మందసలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో స్వచ్చ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రతే రాష్ట్ర అభివృద్ధికి మూలం అని ఆమె పేర్కొన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెట్రోల్ కొరత ఏర్పడింది. నిన్నటి నుంచి బైక్‌లకు కేవలం లీటరు పెట్రోలు మాత్రమే పోస్తున్నారు. అదికూడా లీటరుకు 10 రూపాయల ఎక్కువగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. పెట్రోల్ కోసం వినియోగదారులు క్యూ లైన్లలో అర్ధ గంట ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NLR: మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ స్పందించారు. మోటు చింతల పాలేనికి చెందిన కొండయ్య భార్య, ఇద్దరు పిల్లలు ఆ బస్సులో ఉన్నారని తెలియడంతో ఎమ్మెల్యే కొండయ్యకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. తన కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని కొండయ్య చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
VZM: అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్త ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరగడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక కొత్త యుగానికి నాంది అని ఎమ్మెల్యే లలిత కుమారి పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టుతో ఆ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ పరిధిలో TDP పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలో మంత్రి నారా లోకేష్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను ప్రసాద్ బాబు మంత్రికి వివరించారు.
ELR: నూజివీడు జడ్పీ హైస్కూల్ బాలికల ప్రతిభ మండల స్థాయిలో ప్రథమంగా నిలిపిందని హెచ్ఎం అనురాధ తెలిపారు. హెచ్ఎం గురువారం మాట్లాడుతూ.. తమ పాఠశాలలోని ఐదుగురు బాలికలు ఏకకాలంలో NMMSకు సెలెక్ట్ కావడం అభినందనీయమన్నారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ ఛైర్ పర్సన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదికి 12,000 చొప్పున నాలుగేళ్లు ఆర్థిక సాయం అందిస్తారన్నారు.
NDL: మహానంది(మం) బుక్కాపురం మజారా పుట్టుపల్లె గ్రామానికి చెందిన యువకుడు శ్రీను అకాల మరణంతో కుటుంబాన్ని జనసేన నాయకులు గురువారం పరామర్శించారు. మండల నాయకుడు మారెడ్డి రామయ్య ఆధ్వర్యంలో జనసైనికులు అంత్యక్రియల కోసం రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. నిండు గర్భిణి అయిన మృతుని భార్యకు, కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ATP: RDT సంస్థకు FCRA అనుమతులు లభించడంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం నియోజకవర్గ క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. విదేశీ నిధులపై ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో పేదలకు అందుతున్న వైద్యం, విద్య, క్రీడా సేవలు ఇకపై మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
KRNL: మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్‌ఛార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి భూమిపూజ చేసి గురువారం ప్రారంభించారు. సాతనూరు, ఆగుసునూరు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.2 కోట్లు, కందుకూరు క్రాస్ నుంచి తుంబిగనూరు వరకు బీటీ రోడ్డుకు రూ.3 కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు.
PLD: పొదుపు సంఘాల మహిళా వ్యాపార అభివృద్ధికి ‘సంపన్నకారి’ పథకం వరం లాంటిది అని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపార అభివృద్ధికి కొరకు రూపొందించబడిన ప్రత్యేకమైన ‘సంపన్న కారి’ కార్యాక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
CTR: పుంగనూరు పట్టణం నగిరి వీధి శ్రీసోమేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు ఉదయం సింహ వాహనం సేవ నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, హోమాలు, నిర్వహించి ఉత్సవ విగ్రహమూర్తులను ప్రత్యేక పూజలు చేశారు. సింహ వాహనంపై మంగళ వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు.
TPT: ఎర్పేడు మండలం ఆ మందూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఎ.ఆర్.పి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు టూత్‌పేస్ట్, బ్రష్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి ధర్మారెడ్డి మోహన్ రెడ్డి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిరోజూ దంత ధావన చేయాలని సూచించారు.