• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్ కార్యక్రమానికి 75 అర్జీలు

NTR: జి.కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రజల సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 75 అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించారు. గ్రామాభివృద్ధికి రహదారులు, వంతెనలు సహా పలు పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.

March 26, 2026 / 02:27 PM IST

రోడ్డు భద్రతపై అవగాహన.. హెల్మెట్‌ల పంపిణీ

CTR: మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

March 26, 2026 / 02:20 PM IST

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ ట్రాఫిక్ పోలీసులు ఆదిత్య కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం, అతివేగ నియంత్రణ వంటి అంశాలపై సూచనలు చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

March 26, 2026 / 02:20 PM IST

రేపు మాంసం దుకాణాలు బంద్

VSP: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ పరిధిలోని మాంసం దుకాణాలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. నగరంలో మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలు నిషేధించినట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్‌వి నరేష్ కుమార్ తెలిపారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 26, 2026 / 02:19 PM IST

మహిళల భద్రతకు ‘శక్తి’ యాప్ భరోసా

సత్యసాయి: జిల్లా SP సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శక్తి టీమ్ బృందాలు మహిళలు, బాలికల భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. ఆపద సమయంలో శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని గురువారం నిర్వహించిన సదస్సులో పోలీసులు వివరించారు. పోక్సో చట్టం, సైబర్ నేరాలు, గృహ హింసపై అవగాహన కల్పిస్తూ డయల్ 100, 112, 181 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 26, 2026 / 02:15 PM IST

‘జిల్లాలో అభివృద్ధికి బీజం వేసింది వైఎస్ఆర్’

AKP: జిల్లాలో అభివృద్ధికి బీజం వేసింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. గురువారం నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కరువు నివారణకు ఎస్ఈజెడ్‌ను వైఎస్ఆర్ తీసుకువచ్చిన విషయాన్ని స్థానిక టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. అలాగే, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదిత్యా మిట్టల్‌ను జగన్ ఆహ్వానించారన్నారు.

March 26, 2026 / 02:13 PM IST

‘గ్రామాల పరిశుభ్రతే రాష్ట్ర అభివృద్ధికి పునాది’

SKLM: మందసలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో స్వచ్చ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రతే రాష్ట్ర అభివృద్ధికి మూలం అని ఆమె పేర్కొన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలని పిలుపునిచ్చారు.

March 26, 2026 / 02:11 PM IST

తాడేపల్లిగూడెంలో పెట్రోల్ కొరత.!

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెట్రోల్ కొరత ఏర్పడింది. నిన్నటి నుంచి బైక్‌లకు కేవలం లీటరు పెట్రోలు మాత్రమే పోస్తున్నారు. అదికూడా లీటరుకు 10 రూపాయల ఎక్కువగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. పెట్రోల్ కోసం వినియోగదారులు క్యూ లైన్లలో అర్ధ గంట ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 26, 2026 / 02:09 PM IST

బాధితులకు ఉదయగిరి ఎమ్మెల్యే పరామర్శ

NLR: మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ స్పందించారు. మోటు చింతల పాలేనికి చెందిన కొండయ్య భార్య, ఇద్దరు పిల్లలు ఆ బస్సులో ఉన్నారని తెలియడంతో ఎమ్మెల్యే కొండయ్యకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. తన కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని కొండయ్య చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

March 26, 2026 / 02:08 PM IST

మెగా స్టీల్ ప్లాంట్ పట్ల ఎమ్మెల్యే హర్షం

VZM: అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్త ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరగడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక కొత్త యుగానికి నాంది అని ఎమ్మెల్యే లలిత కుమారి పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టుతో ఆ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

March 26, 2026 / 02:08 PM IST

లోకేష్‌ను కలిసిన పార్లమెంట్ అధ్యక్షులు

అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ పరిధిలో TDP పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలో మంత్రి నారా లోకేష్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను ప్రసాద్ బాబు మంత్రికి వివరించారు.

March 26, 2026 / 02:07 PM IST

జడ్పీ గర్ల్స్ హైస్కూల్ ప్రతిభ

ELR: నూజివీడు జడ్పీ హైస్కూల్ బాలికల ప్రతిభ మండల స్థాయిలో ప్రథమంగా నిలిపిందని హెచ్ఎం అనురాధ తెలిపారు. హెచ్ఎం గురువారం మాట్లాడుతూ.. తమ పాఠశాలలోని ఐదుగురు బాలికలు ఏకకాలంలో NMMSకు సెలెక్ట్ కావడం అభినందనీయమన్నారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ ఛైర్ పర్సన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదికి 12,000 చొప్పున నాలుగేళ్లు ఆర్థిక సాయం అందిస్తారన్నారు.

March 26, 2026 / 02:07 PM IST

మృతుని కుటుంబానికి జనసేన అండ.!

NDL: మహానంది(మం) బుక్కాపురం మజారా పుట్టుపల్లె గ్రామానికి చెందిన యువకుడు శ్రీను అకాల మరణంతో కుటుంబాన్ని జనసేన నాయకులు గురువారం పరామర్శించారు. మండల నాయకుడు మారెడ్డి రామయ్య ఆధ్వర్యంలో జనసైనికులు అంత్యక్రియల కోసం రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. నిండు గర్భిణి అయిన మృతుని భార్యకు, కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 26, 2026 / 02:06 PM IST

క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే జేసీ సంబరాలు

ATP: RDT సంస్థకు FCRA అనుమతులు లభించడంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం నియోజకవర్గ క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. విదేశీ నిధులపై ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో పేదలకు అందుతున్న వైద్యం, విద్య, క్రీడా సేవలు ఇకపై మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

March 26, 2026 / 02:03 PM IST

కోసిగిలో రూ.5 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

KRNL: మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్‌ఛార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి భూమిపూజ చేసి గురువారం ప్రారంభించారు. సాతనూరు, ఆగుసునూరు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.2 కోట్లు, కందుకూరు క్రాస్ నుంచి తుంబిగనూరు వరకు బీటీ రోడ్డుకు రూ.3 కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు.

March 26, 2026 / 02:03 PM IST