• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చురుగ్గా జల్ జీవన్ మిషన్ పనులు

AKP: కోటవురట్ల మండలం అణుకు గిరిజన గ్రామంలో జల్ జీవన్ మిషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్రామంలో నివసిస్తున్న 30 గిరిజన కుటుంబాలకు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేసేందుకు 30 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ నిర్మిస్తున్నారు. మంచినీటి బోరు వేసి నెల రోజుల్లో తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు RWS ఏఈ శ్రీనివాస్ గురువారం తెలిపారు.

March 26, 2026 / 04:04 PM IST

ఫెర్రర్ కుటుంబంతో ఎమ్మెల్యే భేటీ

ATP: కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి FCRA అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురంలో ఫెర్రర్ కుటుంబాన్ని ఆత్మీయంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి ఫలితంగా ఈ రెన్యూవల్ లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాదిగా ఎదుర్కొన్న సంక్షోభం, ఐదు దశాబ్దాల సేవా ప్రయాణంపై అన్నే ఫెర్రర్, విశాల ఫెర్రర్‌తో సునీత చర్చించారు.

March 26, 2026 / 04:02 PM IST

జాతియ రహదారిపై రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ

ప్రకాశం: టంగుటూరు మండలం సూర రెడ్డిపాలెం జాతియ రహదారి ఫ్లైఓవర్ మీద  బాపట్ల నుండి నెల్లూరు బియ్యంలోడ్ తో వెళుతున్న లారీనీ వెనుక నుంచి ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ముందు భాగాన స్టీరింగ్ వద్ద దెబ్బతింది. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

March 26, 2026 / 04:00 PM IST

‘దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి’

E.G: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ (BSP) జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో BSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మపు చిత్ర సేను మాట్లాడుతూ క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ లకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

March 26, 2026 / 04:00 PM IST

సీఎం పర్యటనకు విస్తృత సన్నాహాలు

NLR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో గురువారం విస్తృత సన్నాహక సమావేశం జరిగింది. “పేదల సేవలో” కార్యక్రమం ఏర్పాట్లపై 8 మండలాల జనసేన నాయకులతో సమగ్ర చర్చలు జరిపి, ప్రతి అంశాన్ని సమీక్షించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం నిర్వహించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

March 26, 2026 / 04:00 PM IST

సజ్జాపురంలో కిసాన్ గోష్టి

BPT: సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో ఆత్మ ప్రకాశం జిల్లా సౌజన్యంతో, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కిసాన్ గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి ARS శాస్త్రవేత్త డా. చి. వరప్రసాద్ రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడుకోవాలని సూచించారు. ఆఖరి దుక్కిలో జింక్ సల్ఫేట్ వినియోగం వల్ల జింక్ లోపాలు నివారించవచ్చన్నారు

March 26, 2026 / 04:00 PM IST

తిరుపతిలో CUB శాఖ ప్రారంభం

TPT: బైరాగిపట్టెడలో సిటీ యూనియన్ బ్యాంక్ (CUB) 936వ శాఖను గురువారం తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న బైరాగిపట్టెడ ప్రాంతంలో ఆధునిక బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. సెల్ఫ్ సర్వీస్ బ్యాంకింగ్ సదుపాయాలు ప్రజలకు, వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

March 26, 2026 / 04:00 PM IST

పింఛన్ ఆపేశారంటూ మహిళ ఆందోళన

GNTR: కోయవారిపాలేనికి చెందిన చిన్నం శివమ్మ తన తల్లితో కలిసి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అధికారులు తన పింఛన్‌ను అకారణంగా నిలిపివేశారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తాను టీడీపీ మద్దతురాలినని, ఓ జనసేన నాయకుడు కక్షకట్టి తనపై ఫిర్యాదులు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదుల వల్లే అధికారులు తన పింఛన్ ఆపేశారని, న్యాయం చేయాలని కోరారు.

March 26, 2026 / 04:00 PM IST

‘రైతు బజార్‌లో సమస్యలు పరిష్కరించాలి’

KKD: బస్టాండ్ వద్ద గల రైతు బజార్‌లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏఐకేఎంఎస్, ఐఎఫ్‌టీయూ సంఘాల నాయకత్వంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం రైతులు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వెళ్లి తమ డిమాండ్ల పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్‌కు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించిే కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు.

March 26, 2026 / 03:51 PM IST

మామిడి తోటలో మంటలు

CTR: పుంగనూరు మండలం కూరప్పల్లి గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం రైతు మునస్వామికి చెందిన మామిడి తోటలో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు సిబ్బంది మంటలను ఆర్పేశారు. రూ.20 వేల వరకు పంట నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు.

March 26, 2026 / 03:50 PM IST

పేద బాలిక చదువు కోసం మానవతా ఆర్థిక చేయూత

ELR: నూజివీడు పట్టణంలో ఓ పేద విద్యార్థిని చదువు కోసం ఫీజు నిమిత్తం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 5 వేల రూపాయలను గురువారం ఆర్థిక సాయంగా అందించారు. సేవా సంస్థ ఛైర్మన్ పీ. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో పేదలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. పేదలైన బాలికల చదువు కోసం తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు.

March 26, 2026 / 03:48 PM IST

మహిళల భద్రత కోసం శక్తి యాప్

W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013’ నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రతి ఒక్క మహిళ అవగాహన కలిగి ఉండాలన్నారు.

March 26, 2026 / 03:46 PM IST

మార్కెట్ యార్డులో EVM గోదాం తనిఖీ చేసిన కలెక్టర్

GNTR: ఫిరంగిపురంలో మండలంలోని రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో భద్రపరచిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల గోదాంను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్‌, తమీమ్ అన్సారియా పరిశీలించారు. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక సదుపాయాలు తదితర అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

March 26, 2026 / 03:40 PM IST

గంధం మహోత్సవానికి ఎంపీకి ఆహ్వానం

సత్యసాయి: పెనుకొండ పట్టణం గోనిపెంట రోడ్డులో ఉన్న హజరత్ మొహమ్మద్ కమ్రుద్దీన్ బాబా దర్గా శుక్రవారం ఘనంగా గంధం మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని పెనుకొండలో హిందూపురం ఎంపీ పార్థసారథిని మైనారిటీ సోదరులు కలసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దర్గా ఉత్సవానికి హాజరై ఆశీర్వాదాలు తీసుకోవాలని ఎంపీని కోరారు.

March 26, 2026 / 03:38 PM IST

‘మీడియా సేవలు సమాజానికి కీలకం’

NDL: ఆళ్లగడ్డలోని టీఎస్ ఫంక్షన్ హాల్‌లో APWJF, APUWJ ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా అపుస్మా డివిజన్ అధ్యక్షుడు అమీర్ బాషా, రవీంద్ర చారి దంపతులు, మహిళా శిల్పి భువన పాల్గొని సరుకులు అందజేశారు. వారు మాట్లాడుతూ.. మీడియా సేవలు సమాజానికి ఎంతో ముఖ్యమని అన్నారు.

March 26, 2026 / 03:36 PM IST