• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మొక్కజొన్న పంటలను పరిశీలన

NDL:  పాములపాడు మండలంలోని రుద్రవరంలో మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలు బుధవారం పరిశీలించారు. మొక్కజొన్న పంటకు కంకులు రావడం లేదని ఫిర్యాదులు రావడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించినట్లు సమాచారం. రైతుల నుంచి శాస్త్రవేత్తలు పలు రకాల సమాచారాన్ని సేకరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

March 26, 2026 / 07:34 AM IST

కర్నూలు మెడికల్ కాలేజీకి అరుదైన గౌరవం

KRNL: పుదుచ్చేరిలోని నిర్వహించిన అంతర్జాతీయ వైద్య సదస్సు ‘కోయిసైన్సెస్ 8.0’లో కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు. కఠినమైన డిబేట్ పోటీల్లో ఫైనల్‌కు చేరిన KMC ఫైనల్ ఇయర్ విద్యార్థి కార్తీక్ అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ విజయంతో కర్నూలు మెడికల్ కాలేజీకి ‘సర్టిఫికెట్ ఆఫ్ హానర్స్’ ప్రదానం చేసింది.

March 26, 2026 / 07:30 AM IST

కూర్మనాథ ఆలయ ఆదాయం ఎంతంటే..?

SKLM: గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో బుధవారం హుండీలు తెరిచి కానుకలు లెక్కించారు. ఈవోలు వాసుదేవరావు, గుర్నాథరావు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, భక్తులు లెక్కించారు. 98 రోజులకు రూ.19.76 లక్షలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, వైదిక సిబ్బంది, సాధారణ దుస్తులు ధరించిన భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

March 26, 2026 / 07:30 AM IST

పూర్తిస్థాయి రైళ్ల ప్రతిపాదనలో తాత్కాలిక వాయిదా

VSP: విశాఖ- ఎస్ఎంవీ బెంగళూరు (08581/08582) మే మొదటి వారం వరకు ప్రత్యేక సర్వీసులుగానే నడుస్తాయని వాల్తేర్ సీనియర్ డీసీఎం పవన్ తెలిపారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులను పూర్తిస్థాయి వారాంతపు రైళ్లుగా మార్పు చేసే ప్రతిపాదన వాయిదా వేసినట్లు చెప్పారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలు వాయిదా పడిన విషయాలు ప్రయాణికులు గమనించాలన్నారు.

March 26, 2026 / 07:30 AM IST

కూటమి ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి: ఎమ్మెల్యే

కృష్ణా: కూటమి ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి వెలుగుల్లో వెలుగుతున్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మండలం సాయిపురం, ముదునూరు జాగర్లపూడి పల్లెల్లో ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

March 26, 2026 / 07:29 AM IST

మాజీ సీఎంను కలిసిన ఎమ్మెల్సీ

కోనసీమ: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాటం చేయాలని జగన్ సూచించారని ఇజ్రాయిల్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు.

March 26, 2026 / 07:27 AM IST

పెద్దమండ్యంలో నాటు సారా విక్రేత అరెస్టు : SI

అన్నమయ్య: జిల్లా పెద్దమండ్యం మండలంలో నాటు సారా విక్రయిస్తున్న బుక్కే రవి నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రామానాయక్ తండాలో పోలీసులు దాడులు నిర్వహించి, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రావణి రెడ్డి తెలిపారు.

March 26, 2026 / 07:26 AM IST

‘గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు’

ప్రకాశం: బేస్తవారిపేటలోని గ్యాస్ గోడౌన్‌లో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా నిబంధనలు, అగ్నిమాపక సదుపాయాలు, సిలిండర్ల నిల్వ, రవాణా విధానాలను పరిశీలించారు. గోడౌన్ యజమానులు అన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్యాస్ కొరతను సృష్టిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జున, ఎస్సై రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.

March 26, 2026 / 07:26 AM IST

బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఏలూరు: నగరంలోని సీఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో బీ-ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న చిలుకూరి సువర్షినీ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గమనించిన హాస్టల్ వార్డెన్, ఆమెను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగని వైద్యం కోసం విజయవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

March 26, 2026 / 07:25 AM IST

తిరుమల వెళ్లే వారికి గమనిక

తిరుమలలో ఇవాళ టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం మొత్తం 73,411 మంది శ్రీవారిని దర్శించుకోగా, 30,474 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లుగా నమోదైంది.

March 26, 2026 / 07:22 AM IST

నేడు జి.కొండూరులో ఎమ్మెల్యే ప్రజాదర్బార్

ఎన్టీఆర్: జి.కొండూరులోని హైస్కూల్‌కు వెళ్లే మార్గంలో కమ్యూనిటీ హాల్ వద్ద గురువారం ఎమ్మెల్యే ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని, ప్రజల వద్ద స్వీకరిస్తారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరింది.

March 26, 2026 / 07:20 AM IST

భద్రాచలానికి డైరెక్ట్ బస్సులు..!

WG: ఇవాళ నుంచి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం డిపోల నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ RM గిరిధర్ కుమార్ తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎప్పుడైనా వెళ్లడానికి వీలుగా బస్సులు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని RM తెలిపారు.

March 26, 2026 / 07:20 AM IST

సైబర్ క్రైమ్‌లపై అవగాహన కల్పించిన ఎస్సై

VZM: వంగర గ్రామస్థులకు SI షేక్ శంకర్ బుధవారం రాత్రి వేసవికాలంలో జరిగే దొంగతనాల పట్ల అవగాహన కల్పించారు. చైన్‌ స్నాచింగ్‌, సైబర్‌ క్రైమ్‌, క్రికెట్‌ బెట్టింగ్‌,యాక్సిడెంట్లపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు ఉండి ఊరికి వెళ్లేటప్పుడు తమకు సమాచారం అందించాలన్నారు. రోడ్డు భద్రతా నియమావళి పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు.

March 26, 2026 / 07:20 AM IST

పెనుమూరులో పులి సంచారం..?

CTR: పెనుమూరు (M) కత్తిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి మేకలు మేపేవాడు. రోజులా బుధవారం తాతిరెడ్డిపల్లి, సీఎస్ అగ్రహారం అడవిలో మేకలు మేపుతుంటే మధ్యాహ్నం 3 గంటలకు ఓ మేకను పులి ఎత్తుకెల్లిందని వాపోయాడు. దీంతో ఫారెస్ట్ అధికారి వందన్ తమ బృందంతో సీస్ అగ్రహారం యువకులు 40 మంది కలిసి ఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు.

March 26, 2026 / 07:14 AM IST

శ్రీరామనవమి సందర్భంగా రేపు పాఠశాలలకు సెలవు: DEO

ATP: శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ నెల 27న జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సాధారణ సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఎం.ప్రసాద్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ ఉత్తర్వులను పాటించాలని సూచించారు.

March 26, 2026 / 07:12 AM IST