VZM: వంగర గ్రామస్థులకు SI షేక్ శంకర్ బుధవారం రాత్రి వేసవికాలంలో జరిగే దొంగతనాల పట్ల అవగాహన కల్పించారు. చైన్ స్నాచింగ్, సైబర్ క్రైమ్, క్రికెట్ బెట్టింగ్,యాక్సిడెంట్లపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు ఉండి ఊరికి వెళ్లేటప్పుడు తమకు సమాచారం అందించాలన్నారు. రోడ్డు భద్రతా నియమావళి పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు.