PLD: నాయకుడిపై ప్రజల విశ్వాసం నమ్మకమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మాజీ కౌన్సిలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 -19లో నియోజకవర్గంలో రూ.4 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసినా, ప్రజలు కొత్త వారికి అవకాశం ఇచ్చి తప్పు చేశారన్నారు.
PLD: నాయకుడిపై ప్రజల విశ్వాసం నమ్మకమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మాజీ కౌన్సిలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 -19లో నియోజకవర్గంలో రూ.4 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసినా, ప్రజలు కొత్త వారికి అవకాశం ఇచ్చి తప్పు చేశారన్నారు.
ప్రకాశం: మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు బుధవారం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి దేవాలయ ఇన్‌స్పెక్టర్ ఆర్కే చైతన్య పర్యవేక్షణలో 91 రోజుల ఆదాయం లెక్కించారు. మొత్తం రూ.10,81,510 వచ్చాయని కార్యనిర్వహణాధికారి గొలమూరు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
KKD: పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో గ్రంథాలయ కార్యవర్గం, పోటీ పరీక్షలు విభాగం విద్యార్థులు జాబ్ క్యాలెండర్ ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వారు మాట్లాడుతూ 2025 లో మెగా DSC పేరుతో 16 వేలు పైన ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. అందులో మా గ్రంథాలయం నుండి 12 మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యినట్లు తెలియజేశారు.
VZM: రాజాం మండలం పొగిరిలో డయేరియా కేసులు లేవని కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలో జరిగిన ఒక వేడుకలో కలుషిత ఆహారం తీసుకోవడంతో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఐదుగురు ఆసుపత్రిలో చేరగా, ఇద్దరిని డిశ్చార్జ్ చేసి, మిగిలిన ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
NLR : బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 112 రోజులకు గాను రూే. 52,43,487లు భక్తులు కానుకలుగా సమర్పించారు. యూఎస్ డాలర్లు 11, యూఏఈ దిర్హమ్స్10, కువైట్ దినార్‌లు 2, 44 గ్రాములు బంగారు వస్తువులు, వెండి 248 గ్రాములు రాగ 3 లక్షల 16,995 వచ్చినట్లు ఈవో తెలిపారు.
EG: రాజమహేంద్రవరం రూరల్ సాటిలైట్ సిటీ బి.బ్లాక్‌లో ది. ఇన్నిసుపేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 5వ నూతన బ్రాంచ్‌ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. బుధవారం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి బాబి, బ్యాoకు డైరెక్టర్లు పాల్గొన్నారు.
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలో మడ్డువలస కాలువ పనులు పునఃప్రారంభం కావడంతో ఈ పనులపై ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులను త్వరితగతిన పూర్తి చేసి ఖరీఫ్ సీజన్‌కు రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కాలువ రూట్ మ్యాప్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు
TPT: ఏర్పేడు(M) పంగూరు గ్రామంలో దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి రూ.10 లక్షలు మంజూరు చేయడంతో.. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఈ ప్లాంట్‌ను సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న గ్రామస్థులతో కలిసి ప్రారంభించారు. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల పంగూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
CTR: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని బైరెడ్డిపల్లి ఎస్సై చందన ప్రియ హెచ్చరించారు. మండలంలోని కమ్మనపల్లి కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు బుధవారం పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాను మంచి కోసమే ఉపయోగించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.
గుంటూరు మిర్చి యార్డును ఇవాళ పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. ఈ క్రమంలో పలు అవకతవకలను గుర్తించారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై బిల్లులు లేకుండానే మిర్చి లారీలు బయటకు వెళ్తున్నట్లు వెల్లడైంది. దీనివల్ల యార్డు ఆదాయానికి నష్టం జరుగుతోందని తెలిపారు. అవినీతి అరికట్టేందుకు ఛైర్మన్ కుర్రా అప్పారావు ప్రయత్నిస్తున్నా పరిస్థితి దారుణంగా ఉందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
TPT: సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మత్స్యకారుల సమస్యలపై సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పులికాట్ సరస్సులో తమిళనాడు బోట్ల అక్రమ ప్రవేశం వల్ల స్థానిక మత్స్యకారులు నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కోనసీమ: రామచంద్రపురంలో అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులకు బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 25,000 ఆర్థిక సహాయం అందించి పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి సామాజిక బాధ్యతగా తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తానన్నారు.
W.G: కాళ్ల మండల పశువైద్యాధికారిగా డా. సీహెచ్. యుగంధర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చిన ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. పశువుల ఆరోగ్య సంరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
VSP: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణికి రాయగడ సమీపంలో ప్రసవ వేదనలు రావడంతో టిటిఇ ఎస్. శ్రీకాంత్ వెంటనే స్పందించారు. పార్వతీపురం స్టేషన్‌లో వైద్య సహాయం ఏర్పాటుచేయగా, రైలులోనే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉండగా, ఆసుపత్రికి తరలించినట్టు విశాఖ రైల్వే అధికారులు తెలిపారు.