CTR: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని బైరెడ్డిపల్లి ఎస్సై చందన ప్రియ హెచ్చరించారు. మండలంలోని కమ్మనపల్లి కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు బుధవారం పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాను మంచి కోసమే ఉపయోగించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.
గుంటూరు మిర్చి యార్డును ఇవాళ పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. ఈ క్రమంలో పలు అవకతవకలను గుర్తించారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై బిల్లులు లేకుండానే మిర్చి లారీలు బయటకు వెళ్తున్నట్లు వెల్లడైంది. దీనివల్ల యార్డు ఆదాయానికి నష్టం జరుగుతోందని తెలిపారు. అవినీతి అరికట్టేందుకు ఛైర్మన్ కుర్రా అప్పారావు ప్రయత్నిస్తున్నా పరిస్థితి దారుణంగా ఉందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
TPT: సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మత్స్యకారుల సమస్యలపై సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పులికాట్ సరస్సులో తమిళనాడు బోట్ల అక్రమ ప్రవేశం వల్ల స్థానిక మత్స్యకారులు నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కోనసీమ: రామచంద్రపురంలో అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులకు బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 25,000 ఆర్థిక సహాయం అందించి పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి సామాజిక బాధ్యతగా తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తానన్నారు.
W.G: కాళ్ల మండల పశువైద్యాధికారిగా డా. సీహెచ్. యుగంధర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చిన ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. పశువుల ఆరోగ్య సంరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
VSP: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణికి రాయగడ సమీపంలో ప్రసవ వేదనలు రావడంతో టిటిఇ ఎస్. శ్రీకాంత్ వెంటనే స్పందించారు. పార్వతీపురం స్టేషన్‌లో వైద్య సహాయం ఏర్పాటుచేయగా, రైలులోనే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉండగా, ఆసుపత్రికి తరలించినట్టు విశాఖ రైల్వే అధికారులు తెలిపారు.
అన్నమయ్య: ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం నంద్యాల ప్యాసింజర్ రైలును ఎక్కే ప్రయత్నంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రెడ్డయ ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి రైలు కిందపడ్డ అతడిని సురక్షితంగా బయటికి తీశారు. గాయపడిన విద్యార్థిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం: చీమకుర్తి మండలం నిప్పట్లపాడు గ్రామంలో ఫేజ్-3 కింద బెంగళూరు-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం చేపట్టవలసిన భూ సేకరణ ప్రక్రియలో భాగంగా బుధవారం జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి భూమిని పరిశీలించారు. భూమి సేకరణలో భాగంగా సంబంధిత భూ యజమానుల రికార్డులను పరిశీలించారు. జేసీ వెంట ఎస్‌డీసీ కళావతి, తహసీల్దార్ బ్రహ్మయ్య, రెవిన్యూ అధికారులు ఉన్నారు.
KRNL: ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 40 గ్రామాలను క్షయ విముక్తి గ్రామాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఆదోని మండలం పాండవగల్లు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉమాదేవికి కర్నూలులో బుధవారం పురస్కారం అందజేశారు. గ్రామ ప్రజలు, హెల్త్ సిబ్బంది సమిష్టి కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.
ELR: జిలుగుమిల్లీ మండలం కామయ్యపాలెం గ్రామంలో బుధవారం మహిళలకు కుట్టు మిషన్లను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పంపిణీ చేశారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
VZM: మరణించిన మహిళా హోమ్ గార్డు ఎం. రోహిణి కుమారి కుమారుడు హేమంత్ కుమార్‌కు జిల్లా పోలీసు శాఖ అండగా నిలిచింది. తోటి ఉద్యోగులు స్వచ్ఛందంగా సేకరించిన రూ. 3,15,240ల ఆర్థిక సాయాన్ని బుధవారం అదనపు ఎస్పీ సౌమ్యలత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న తోటి సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమన్నారు.
KDP: జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భగా నియోజకవర్గంలో జరుగుతున్న పనులు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ స్కాచ్ అవార్డు అందుకున్నందుకు కలెక్టర్‌ను సన్మానించారు.
ASR: కొయ్యూరు మండలంలో 7,436 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్దిదారులకు గాను రూ.3,12,01,500 సొమ్ము మంజూరైనట్లు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు బుధవారం తెలిపారు. ఈనెల 31వ తేదీన పెన్షన్ సొమ్మును బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించారు.
BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 27న జిల్లాలో పర్యటించనున్నారు. జే.పంగులూరు మండలంలోని రామకూరు గ్రామంతో పాటు, కొరిశపాడు మండలంలోని పీ.గుడిపాడు, కుర్రావానిపాలెం గ్రామాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని, స్థానిక సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.
PLD: సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరై ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు ఈ టీకాలు తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు. పశువుల రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.