• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: నంద్యాల మండలం కానాల గ్రామపంచాయతీ పరిధిలోని హై స్కూల్ కొట్టాల గ్రామంలో ఇవాళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 25, 2026 / 08:22 PM IST

ఈఈపై సస్పెన్షన్ ఎత్తివేత..!

VSP: సింహాచలం దేవస్థానంలో చందనోత్సవంలో గోడ కూలిన పలువురు మరణించిన ఘటనలో సస్పెండ్ అయిన దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజుపై ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై విచారణ అనంతరం విధించిన క్రమశిక్షణా చర్యలను ఇప్పుడు రద్దు చేయడంతో, ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు.

March 25, 2026 / 08:18 PM IST

మంత్రి లోకేష్‌ను కలిసిన ఎన్జీవో నేతలు

GNTR: మంత్రి నారా లోకేష్‌ను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి విద్యాసాగర్ ఇతర జేఏసీ నేతలు సంయుక్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 25, 2026 / 08:16 PM IST

భద్రాచలంకు ప్రత్యేక బస్సులు

ELR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దర్శనానికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని ఆర్టీసీ విజయవాడ జోన్ 2 ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఏలూరు డిపో నుంచి 20 బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 14 బస్సులు, నూజివీడు నుంచి 6 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

March 25, 2026 / 08:13 PM IST

కేంద్ర మంత్రితో వేమిరెడ్డి దంపతుల భేటీ

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను బుధవారం కలిశారు. పెన్నా నది కరకట్టల బలోపేతం, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందచేశారు. 2011లో వచ్చిన వరదలు దాటికి ప్రజలు పడ్డ ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

March 25, 2026 / 08:13 PM IST

‘జీడీపీ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి’

SKLM: జిల్లాలో 3వ త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో GDP లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. జిల్లా అభివృద్ధి వేగవంతం కావాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం పథకాలకు బ్యాంకులు సమయానికి రుణాలు మంజూరు చేయాలన్నారు.

March 25, 2026 / 08:12 PM IST

బాలికల రక్తహీనతపై ప్రత్యేక దృష్టి

ASR: బాలికల రక్తహీనతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని జిల్లా వైద్య నిపుణులు గ్రేష్టు, కిషోర్‌కుమార్ తెలిపారు. డుంబ్రిగూడ కేజీబీవీలో బుధవారం 40 మంది విద్యార్థినులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర బాల్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. పాఠశాలలతో పాటు గ్రామాల్లో 15 ఏళ్ల బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామన్నారు.

March 25, 2026 / 08:12 PM IST

కాలువలు పూర్తి చేయాలి: సీపీఎం

ప్రకాశం: పామూరు మండలం దోబగుంట్ల వద్ద వెలిగొండ ప్రాజెక్టు కాలువల పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు సయ్యద్ అనీఫ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మోపాడు రిజర్వాయర్‌ను వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చి రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని కోరారు. దీంతో మండలంలోని రైతులకు సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.

March 25, 2026 / 08:12 PM IST

‘డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవు’

KDP: డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్‌మెంట్ డీటీ సుధీర్ హోటళ్లు, డాబాల యజమానులకు సూచించారు. బుధవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీలో 80 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వచ్చాయని, వాటిని హోటళ్లు, డాబా యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 25, 2026 / 08:11 PM IST

‘స్థానిక ఎన్నికలు గెలుపే లక్ష్యంగా పని చేయాలి’

VZM: మెరకముడిదాం మండల వైసీపీ నాయకులతో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ క్యాడర్ స్థానిక ఎన్నికలు గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అన్నారు. అలాగే, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

March 25, 2026 / 08:11 PM IST

అవయవ దానంపై పోస్టర్ ఆవిష్కరణ

KKD: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జీవన్‌దాన్’ పిలుపు నేపథ్యంలో కమ్యూనిటీ పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కార్యాలయంలో ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి పాల్గొన్నారు.

March 25, 2026 / 08:11 PM IST

‘కోతులు, కుక్కల బెడద అరికట్టాలి’

NTR: తిరువూరులోని పలు ప్రాంతాల్లో కోతులు, కుక్కల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా వృద్ధులు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు సంచారం ఎక్కువ అవడం వల్ల రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సోషల్ యాక్టివిస్ట్ రాం ప్రదీప్ బుధవారం ఆర్‌డీవో ఏ.కుమార్‌ని కలసి కోరారు.

March 25, 2026 / 08:10 PM IST

ఆసుపత్రిని తనిఖీ చేసిన ఇమ్యునైజేషన్ అధికారి

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు PHCని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ హనుమంతరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ, వార్డులను పరిశీలించి రికార్డులను వెరిఫై చేశారు. సంజీవని వైద్య సేవలపై డాక్టర్ ప్రవీణ్ కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

March 25, 2026 / 08:06 PM IST

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

TPT: రాపూరు- పెంచలకోన మార్గంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి సుమారు 13 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడేందుకు నిఘా పెంచినట్లు పోలీసులు తెలిపారు.

March 25, 2026 / 08:05 PM IST

పోలీసులకు అధునాతన డ్రోన్ వితరణ

CTR: జీడి నెల్లూరు పోలీసులకు వ్యాపారవేత్త ప్రసన్నకుమార్ అధునాతన డ్రోన్ వితరణగా అందించారు. దీనిని ఎస్పీ తుషార్ సీఐ ప్రసాద్‌కు బుధవారం అందజేశారు. స్మార్ట్ పోలీసింగ్ కార్యక్రమాలకు పలువురు దాతలు సహకారం అందిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ప్రజా భద్రత కోసం ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

March 25, 2026 / 08:02 PM IST