CTR: జీడి నెల్లూరు పోలీసులకు వ్యాపారవేత్త ప్రసన్నకుమార్ అధునాతన డ్రోన్ వితరణగా అందించారు. దీనిని ఎస్పీ తుషార్ సీఐ ప్రసాద్‌కు బుధవారం అందజేశారు. స్మార్ట్ పోలీసింగ్ కార్యక్రమాలకు పలువురు దాతలు సహకారం అందిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ప్రజా భద్రత కోసం ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.