W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో శనివారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సాయిభవాని ఆధ్వర్యంలోని వైద్య బృందం పలువురికి రక్తపోటు, మధుమేహం వంటి పరీక్షలు నిర్వహించి, మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ ఉదయలక్ష్మి, డీఈఓ సాయిరాం వెంకటేష్, ఎం.ఎల్.హెచ్.పి సంఘమిత్ర, ఎంపీహెచ్ఎ వెంకట్రాజు పాల్గొన్నారు.
ప్రకాశం: బల్లికురవ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి తహశీల్దార్ రవి నాయక్ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది చాలా విలువైనదని అన్నారు. దానిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.
ప్రకాశం: ప్రజా సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించేందుకే ‘మన ఊరు- మన ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురం పట్టణం లోని తూర్పువీధిలో శనివారం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలు తెలియజేసిన సమస్యలను అక్కడికక్కడే అధికారులకు తెలిపి వెంటనే పరిష్కరించాలని సూచించారు.
శ్రీకాకుళం: నగరంలోని విజయగణపతి ఆలయంలో అర్చకులు శనివారం ఉదయం పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ పుష్పాలతో స్వామిని అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు.
ప్రకాశం: పొదిలిలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం సందర్బంగా నగర పంచాయితీ కమిషనర్ పి శ్రీనివాసులు, ఎంఆర్ఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ఓటు యెక్క విలువ ఎంతో ప్రాధాన్యమైనదని, ఓటుతో మంచి నాయకులను ఎన్నుకోవచ్చని వివరించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.
ప్రకాశం: మర్రిపూడిలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల తహసీల్దార్ జ్వాల నరసింహ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక ర్యాలీని విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారాన్ని చేపట్టారు. విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఓటు యొక్క ప్రాముఖ్యతను తహసీల్దార్ విద్యార్థులకు, ప్రజలకు వివరించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
NTR: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త, వీరాభిమాని శ్రీ సుంకర దుర్గాప్రసాద్ (ఆలపాటి శివ మామ) మరణం విచారకరమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. శనివారం దేవినేని గొల్లపూడి దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాలలో ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. అనుమానితుల ఇళ్ళలో సోదాలు నిర్వహించి గ్రామస్థులతో గ్రామసభ నిర్వహించామన్నారు.
ATP: గుంతకల్లు అంబేడ్కర్ విగ్రహం ఎదుట శనివారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ.. అనంతపురంలో ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి చావుకు కారణమైన కళాశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఫీజులు వసూలు చేసే మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రాణాలు కాపాడడంలో లేదని మండిపడ్డారు.
బాపట్ల: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ అన్నారు. రేపల్లె పట్టణ 2వ వార్డులో శనివారం ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చి ప్రారంభోత్సవ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు మహేష్ ఉన్నాడు.
ATP: జాతీయ ఓటరు దినోత్సవాన్ని శనివారం రొళ్ల తాహశీల్దార్ షేక్షావల్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమములో భాగంగా తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులచే బస్టాండ్ కూడలి వరకు ర్యాలి నిర్వహించి రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాహశీల్దార్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు.
కృష్ణా: రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలయ్యాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ మేరకు శనివారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రూ.40.22కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.
E.G: రాబోయే రోజుల్లో రాజమండ్రి నగరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజమండ్రిలోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్‌లో జరిగిన లెజెండ్స్ కప్-2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు.
NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఉన్న సంతపేట కాలువలో శనివారం ఆడశిశువు మృతదేహం లభ్యమయింది. గుర్తుతెలియని ఆడశిశువు మృతదేహం యొక్క వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. నెలలు కూడా నిండని ఆడశిశువు మృతదేహం కాలువలో పడి ఉంది. స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
E.G: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలోని వై.జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డి.నరసింహా కిశోర్, జేసీ ఎస్.చిన్న రాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్, డీఆర్వో టి.సీతారామ మూర్తి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.