ప్రకాశం: యువత ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలని జిల్లా సీపీఐ కార్యదర్శి ఎం.ఎల్ నారాయణ అన్నారు. ఒంగోలు నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఏఐవైఎఫ్ 16వ మహాసభలలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 2015, 2016, 2017, 2018 డిగ్రీలో ఫెయిల్ అయిన విద్యార్థులకి మరొక అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ వీసీ నాయక్ తెలిపారు. అభ్యర్థులకి ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగంచుకోవాలన్నారు.
KRNL: చిప్పగిరి మండలంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సచివాలయం, ZPHS పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే విరుపాక్షి హాజరయ్యారు. విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. స్వాతంత్రం కోసం త్యాగం చేసిన మహనీయుల సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సేవలు అమోఘమన్నారు.
KRNL: పెద్దకడబూరులోని సచివాలయం – 2 వద్ద గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఎంపీపీ శ్రీవిద్య జాతీయ జెండాను ఎగుర వేశారు. సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీటీసీ సుజాత, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు.
VZM: 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా లక్కవరపుకోట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండల తహసీల్దార్ జాతీయ పతాకాన్ని డిఎంజిఎన్ ప్రసాదరావు ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన ఆనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
SKLM: జీ.సిగడాం మండలం ఆనందపురం అగ్రహారంలో ఉన్న షిరిడి సాయి బాబా వార్షికోత్సవ వేడుకలలో ఎచ్చె ర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశేష భక్త జనం నడుమ జరుగుతున్న అన్నప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు.
VZM: స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం అత్యంత ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. 2047 నాటికి మన జిల్లాను సువర్ణ విజయనగరంగా ...
కృష్ణా: సవాళ్లను అధిగమించేందుకు మనందరి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రజల సహకారంతో వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాము జాతీయ జెండాను ఎగరవేశారు.
కృష్ణా: గుడివాడ పట్టణ జనసేన పార్టీ కార్యాలయం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, పట్టణ ఉపాధ్యక్షుడు వేమూరి త్రినాథ్, కార్యదర్శి సాయన రాజేష్,తదితర నేతలు, వీర మహిళలు పాల్గొన్నారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని గోనబావి క్రాస్ వద్ద ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఈ రోజు బోల్తా పడింది. ఈ ఘటనలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్తున్న 6 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పెద్ద ప్రమాదం తప్పిందని పాఠశాల హెచ్ఎం తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ATP: గుంతకల్లు తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తహసిల్దార్ రమాదేవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని చాటడానికి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
NLR: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్నారు. దేశ రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదన్నారు.
ప్రకాశం: కలెక్టర్ అన్సారియాకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2024 లభించింది. శనివారం విజయవాడలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతులమీదుగా అందుకున్నారు. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన, అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేసుకునేందుకు అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు అవార్డు అందుకున్నారు.
W.G: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కళల విభాగంలో పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు శనివారం అభినందనలు తెలిపారు. సినిమా, రాజకీయ, సామాజిక రంగాలకు బాలకృష్ణ ఎనలేని సేవలను అందిస్తున్నారన్నారు.
ప్రకాశం: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాద మౌలిక విలువలను అనుసరిస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని కోరారు.