KKD: జాతీయ స్థాయి స్కూల్ క్రీడా పోటీలకు పెద్దాపురంకు చెందిన విద్యార్థిని మన్యం పల్లవి ఎంపికైనట్లు పీడీ కామిరెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆర్బీపట్నం జడ్పీ స్కూల్లో ఆరో తరగతి చదివే మన్యం పల్లవి జిమ్నాస్టిక్స్‌లో ఎంపికైందన్నారు. ఆమె జనవరి 29-30 వరకు పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జరిగే క్రీడల్లో అండర్-14 అమ్మాయిల కేటగిరీల్లో పాల్గొంటుందన్నారు.
ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం ఉదయం మొదలైంది. సబ్ కలెక్టర్ స్మరణ రాజ్ ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. వారి సమస్యలను సబ్ కలెక్టర్ తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలో అర్జీలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
ప్రకాశం: జిల్లా రజకవృత్తిదారుల సంఘ సమావేశం చీమకుర్తి పట్టణంలో జరిగింది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాము, మాలకొండయ్య మాట్లాడుతూ.. 50 ఏళ్లు నిండిన ప్రతి రజకుడికి ప్రభుత్వం వెంటనే పింఛన్ మంజూరు చేయాలని కోరారు. రజకవృత్తిదారులని ప్రోత్సహించేలా ప్రభుత్వం పథకాలను రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని రజకులు పాల్గొన్నారు.
AKP: దేవరాపల్లి మండలం జీ. కొత్తూరు గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ట్యాంక్ నిర్మాణం కొరకు సోమవారం కొలతలు తీసే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సర్పంచ్ బూరే బాబురావు తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. త్వరలో ట్యాంక్ నిర్మాణం చేపట్టి ఇంటింటికి నీటిని అందిస్తామన్నారు.
VSP: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ పెట్టుబడిదారుల సమావేశం సోమవారం నోవోటెల్ హోటల్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశం ప్రధానంగా పర్యాటకం, అరకు కాఫీ, డెస్టినేషన్ వెడ్డింగ్ తదితర అంశాలపై దృష్టి సారించినన్నారు. పెట్టుబడిదారులకు స్థానికంగా ఉన్న అవకాశాలను విస్తరిస్తారు. ఈ సందర్భంగా పర్యాటకశాఖ 8 కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది.
ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు నరసింహారెడ్డిని సోమవారం ఇటీవల కనిగిరి డివిజన్‌కు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డికి డీఎస్పీ పుష్పగుచ్చమిచ్చే శుభాకాంక్షలు తెలిపారు. కనిగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిఎస్పీకి ఎమ్మెల్యే సూచించారు.
మన్యం: సీతంపేట మండల కేంద్రంలో గిరిజనాభివృద్ధికి ఐటీడీఏ పెద్దపీట వేస్తుందని పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో త్వరలో నాలుగో తరగతి ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నామన్నారు. గ్రామాల్లో రహదారులు, మంచినీరు, కల్పిస్తామని అన్నారు.
KDP: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత రాచమల్లుకు లేదని టీడీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గడిచిన మూడు నెలలుగా రాచమల్లు జార్జ్ క్లబ్‌పై అసత్య ఆరోపణలు గుప్పిస్తూ, వాటిని ఎమ్మెల్యే వరదకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఏనాడైనా అసాంఘికకార్యక్రమాలు ఎమ్మెల్యే వరద ప్రోత్సహించారా అన్నది ఆయనకే తెలియదా అని ప్రశ్నించారు.
E.G: బొమ్మూరుకు చెందిన పెనుమళ్ళ రమ్య స్మృతి(35) మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చికిత్స కోసం వచ్చింది. తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. దీంతో వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. పరిస్థితి విషమించడంతో KKD జీజీహెచ్‌లో చేర్చగా ఆదివారం మృతి చెందింది.
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని పలు రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని అమ్మవారికి నెయ్యి దీపాలు వెలిగించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
TPT: డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని, అర్జీలు, ఫిర్యాదులు ఇచ్చే వారి కోసం ఉదయం 10:30 నుండి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం జరుగుతుందన్నారు.
VSP: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యరావు, రాజకీయ ప్రముఖులు, నేవీ అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి.
VZM: ఉత్తమ మండల వ్యవసాయ అధికారిగా గంట్యాడ మండల వ్యవసాయ అధికారి బి. శ్యాంకుమార్ ఆదివారం అవార్డు అందుకున్నారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ చేతుల మీదుగా ఏవో శ్యాం కుమార్ ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఏవో శ్యాం కుమార్ రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని కొనియాడారు.
VSP: జిల్లాకు చెందిన ఓలింపియన్ ఎర్రాజి జ్యోతి మరో అంతర్జాతీయ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫ్రాన్స్‌లో నాంటెక్స్ మెట్రో పోల్‌లో జరిగిన ఎలైట్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మహిళల 60 మీటర్ల హార్డిల్స్‌లో మంచి ప్రతిభ కనపర్చి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పతకం సాధించిన జ్యోతిని పలువురు అభినందిస్తున్నారు.
కోనసీమ: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి తీర్థ మహోత్సవాలు భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలని MLA దేవ వరప్రసాద్ అధికారులకు సూచించారు. ఆలయం వద్ద జరుగుతున్న ఉత్సవాల పనులపై ఆదివారం సాయంత్రం ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్, R&B అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ దిరిసాల బాలాజీ పాల్గొన్నారు.