TPT: కోట మండలం విద్యానగర్ గ్రామంలో నేడు ‘అన్నదాత సుఖీభవ-రైతన్న మీ కోసం’ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గూడూరు MLA పాశం సునీల్ కుమార్ పాల్గొంటారని స్థానిక నేతలు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోట మండల రైతు అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.
తిరుపతి: జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజలకు భద్రతపై అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలో నిన్న దొంగతనాల నివారణ, సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలపై సూచనలు ఇచ్చారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు.
చిత్తూరు: ఐరాల మండలం పాలకలలోని 8.49 ఎకరాలను నిషేధిత జాబితా 22ఏ(1)ఈ నుంచి డీ-నోటిపై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 1681/2 సర్వేలో 5.66 ఎకరాలు, 1682/3 సర్వేలోని 2.83 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
CTR: బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి పదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలకు ఎంపిక జరుగుతుందన్నారు. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి అని ఆయన ప్రకటించారు.
SKLM: ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. అర్జీదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. 55 వినతులు స్వీకరించినట్లు తెలిపారు.
W.G: ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నరసాపురం బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. CM సహాయనిధి నుంచి మంజూరైన రూ.7.50 లక్షల విలువైన చెక్కును రాయపేటకు చెందిన తమ్మిశెట్టి బాజ్జీ కుటుంబానికి సోమవారం అందజేశారు. నేరుగా లబ్ధిదారుల నివాసానికే వెళ్లి ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
KDP: పులివెందుల – తొండూరు ప్రధాన రహదారిలోని చెట్ల నీడన తాటి ముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత వేసవికాలంలో ప్రజలు అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు తాటి ముంజల వైపు మొగ్గు చూపుతున్నారు. డజన్ తాటి ముంజలు రూ.80 నుంచి రూ.100ల వరకు విక్రయిస్తున్నారు. తాటి ముంజలను తినడంవల్ల శరీరం డిహైడ్రేషన్ కాకుండా కాపాడి, శరీర బరువును తగ్గిస్తుంది.
SKLM: మెలియాపుట్టి మండలానికి ITDA ఏర్పాటు కోసం బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఇవాళ ST కమీషన్ ఛైర్మన్ సొళ్ల బొజ్జి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ITDA ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
NTR: తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లిలో సోమవారం సిలువ మార్గ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్థానిక RCM చర్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో క్రైస్తవ సోదరులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు పడిన శ్రమలను స్మరించుకుంటూ, భక్తులు సిలువను మోస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రార్థనలతో ఊరేగింపు నిర్వహించారు.
ATP: కనేకల్ మండలం బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యాలయాల్లో తప్పు జరిగితే భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలు చేపడతామని పీడీఎస్యూ యువత పేర్కొన్నారు. భగత్ సింగ్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు.
KRNL: ప్రభుత్వం ప్రవేశపెట్టిన AP-AIMS యాప్‌ను ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏవో సురేశ్ బాబు రైతులకు సోమవారం సూచించారు. ఈ యాప్ ద్వారా పంట వివరాలు, వాతావరణ సమాచారం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు వంటి వ్యవసాయ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చన్నారు. రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో తమ రైతు విశిష్ఠ సంఖ్యను నమోదు చేసుకోవాలని తెలిపారు.
ELR: గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చడంలో జలజీవన్ మిషన్ పథకం ఒక గొప్ప వరం లాంటిదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం దెందులూరులో రూ.65.10 లక్షల రూపాయల జల్జీవన్ మిషన్ నిధులతో చేపట్టిన ఓవర్ హెడ్ రిజర్వాయర్ సిస్టం పనులకి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ప్రజలకు త్రాగునీరు సమస్యలు పరిష్కరిస్తూ పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే స్పెషల్ డెప్యూటీ కలెక్టర్(SDC)గా శ్రీకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పనిచేస్తానని తెలిపారు.
కోనసీమ: నక్కపల్లిలో జరుగుతున్న ఆర్కలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సోమవారం రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ విచ్చేసారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విశాఖపట్నం పార్టీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు విషయాలుపై చర్చించారు.
KDP: అక్కంపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై టి. సుండుపల్లి మండలంలో టిడిపి ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్‌మోహన్ రాజు తక్షణ స్పందన తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం ఆదేశాలు ఇచ్చారు. సమస్య త్వరగా పరిష్కారమవుతుందని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.