ప్రకాశం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో మాంసాహార దుకాణాలను మూసివేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలో రెస్టారెంట్లలో, హోటల్స్‌లో మాంసాహారాన్ని విక్రయించవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మాంసాహారం అమ్మినట్లు తెలిస్తే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.
ప్రకాశం: కనిగిరి మండలం కొత్త ఏరువారిపల్లికి చెందిన హర్షవర్ధన్ ఆదివారం విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపికయ్యారు. హర్షవర్ధన్ నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. NCCలో చేరి ప్రతిభను చూపుతూ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా కంటింజెంట్ తరపున ఈ వేడుకలకు ఎంపికైనట్లుగా నిర్వాహకులు తెలిపారు.
W.G: ఆచంట మండల వ్యాప్తంగా ఆదివారం వేకువజాము నుంచి పొగమంచు దట్టంగా అలుముకుంది. తీవ్రమైన పొగమంచు కారణంగా ఉదయం వేళ పొలాలకు వెళ్లే రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఐదు రోజులుగా పొగమంచు ఉదయం 9 గంటలు దాటిన ఈ విధంగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు మంచులో తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
బాపట్ల: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు టోల్ ప్లాజా సమీపంలో శనివారం సాయంత్రం సంతమాగులూరు సీఐ వెంకటరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వాహన రికార్డులు, లైసెన్స్‌లు లేని వాహనాలను గుర్తించి జరిమానాలను విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనచోదకులు తప్పనిసరిగా రహదారి నియమాలు పాటించాలని అన్నారు.
నెల్లూరు: ఉలవపాడులోని GVSM ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ P.లక్ష్మి సుధారాణి ఓటు హక్కు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సమాజానికి మేలు చేకూరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు.
NLR: పుష్యమాస బహుళ ఏకాదశి శనివారం కలిసి రావడంతో మనుబోలు అంబేద్కర్ నగర్లోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు కుమార్ శర్మ స్వామి, అమ్మవార్లకు క్షీర పంచామృత అభిషేకంను నిర్వహించారు. నూతన పట్టు వస్త్రాలతో ప్రత్యేక పూలతోను అలంకరించినారు. ఉభయకర్తలగా వీఆర్ఎ జిట్టా శంకరయ్య శ్యామలమ్మ దంపతులు వ్యవహరించారు.
నెల్లూరు: ఇందుకూరుపేట మండలం, కొత్తూరు గ్రామం నందు రక్తహీనతతో బాధపడుతున్న, అత్యంత పేదరికంలో ఉన్న నాలుగురికి గర్భిణీ స్త్రీలకు, ఓక బాలింతకు ప్రొవిజన్స్, న్యూట్రిషన్ డైట్‌ను శనివారం జగదేవిపేట పిహెచ్‌సీ కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్, హెల్త్ సెక్రటరీలు సుజాత, యానాదమ్మ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ATP: తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవలే సరస్వతి, రహీం, అనే ఇద్దరు వైస్ ఛైర్మన్లు పదవికి రాజీనామా చేశారు. తాడిపత్రి అభివృద్ధి కోసం కౌన్సిలర్లు నిరంతరం కృషి చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కౌన్సిలర్ల రుణం తీర్చుకోలేనిదని జేసీ కంటతడి పెట్టి కన్నీరు కార్చారు.
NLR: దేశవ్యాప్తంగా ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం రాత్రి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. విద్యుత్ కాంతులతో నగరపాలక సంస్థ కార్యాలయం దగదగా మెరుస్తు ఆకర్షిస్తుంది.
ATP: గుంతకల్లు మార్కెట్ యార్డ్ వద్ద శనివారం హెల్మెట్ ధరింపుపై ప్రజలకు సీఐ మస్తాన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ప్రాణాలతో బయటపడే వీలుంటుందని వాహనదారులకు సూచించారు.
VZM: అన్యాక్రాంతమైన CBCNC ఆస్తులపై CBCID విచారణ చేపట్టాలని ఆ సంస్థ ఛైర్మన్ ఆర్ఎస్ జాన్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్ఎంబీ చర్చిలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. బాప్టిస్ట్ నేతలు అనుకూలంగా వినియోగించుకుంటూ ఆస్తులు అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఆస్తులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
VZM: పోస్టల్ భీమాతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పోస్టల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవిబాబు అన్నారు. బొబ్బిలి పట్టణంలోని జెండామాల్ జంక్షన్లో పోస్టల్ పిఎల్ఐ, ఆర్,పి.ఏ.ఐ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ భీమాతో మంచి భవిష్యత్తు ఉంటుందని, భీమా చేసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు. 18 నుంచి 55ఏళ్ల లోపు వారు భీమా చేసుకోవచ్చునన్నారు.
అల్లూరి: పాడేరు మెడికల్ కళాశాలలో 244 పోస్టులు ఆదివాసీలతోనే భర్తీ చేయాలని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ కోరారు. ఈమేరకు శనివారం రాష్ట్ర జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్‌కు వినతిపత్రం అందించారు. వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులకు కేటాయించాలని, కళాశాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం: రిటైర్డ్ డిప్యూటీ DEO వెంకటరెడ్డిని మార్కాపురంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఒద్దుల వీరారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వెంకటేశ్వర్లు, రాజేశ్, వెంకటేశ్వరరెడ్డి, ఫణీంద్ర, పెద్దారవీడు యూటీఎఫ్ నాయకులు వెంకటేశ్వర్లు కలిశారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా సమావేశం అయినట్లు వారు తెలిపారు. పలు అంశాలపై చర్చించుకున్నట్లు తెలిపారు.
ఏలూరు: జిల్లాలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక హైస్కూల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన తెలుపుతూ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన 8 మంది విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.