ATP: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠిక పఠనం కార్యక్రమం అనంతపురంలోని SSBN కళాశాలలో ఐద్వా, SFI ఆధ్వర్యంలో శనివారం జరిగింది. జాతీయ జెండాను చేత పట్టి, రాజ్యాంగ పీఠిక పఠనం, ప్రమాణాన్ని ప్రతిజ్ఞ చేశారు. భారతదేశంలో కులాలకు, మతాలకు, ప్రాంత, వర్గ, భాష భేదాలు లేకుండా భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు సంక్రమించిందన్నారు.
ATP: పుష్య మాసం బహుళ ఏకాదశి సందర్భంగా పామిడిలోని లక్ష్మీ నారాయణ స్వామికి విశేష పూజలు చేపట్టారు. సుదర్శన చక్ర అభిషేకం నిర్వహించారు. అర్చకులు అర్చన చేశారు. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం గావించారు, భగవద్గీత పఠించారు. అనంతరం శ్రీ దేవి, భూదేవి సహిత స్వామి వారి విగ్రహాలను పల్లకీలో ఉంచి గోవింద నామ స్మరణలతో ప్రాకారోత్సవం సాగించారు.
KRNL: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు పెద్దకడబూరు మండలంలోని మద్యం, మాంసం దుకాణాలను బంద్ చేయాలని ఎస్సై నిరంజన్ రెడ్డి సూచించారు. దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవంగా జాతీయ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా పెద్దకడబూరులోని వైన్ షాపులు, చికెన్, మటన్ షాపులు, వివిధ గ్రామాల్లో మాంసం దుకాణాలను బంద్ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
NDL: బనగానపల్లె-అవుకు ప్రధాన రహదారిలో ఉన్న శ్రీనివాస రైస్ మిల్ శుక్రవారం సాయంత్రం కుప్ప కూలింది. నంద్యాల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బషీరున్నిసా బేగం, ఉ. కర్నూలు జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ రెడ్డి శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు వర్కర్స్‌లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు KNL GGHలో చికిత్స పొందుతున్నారన్నారు.
కృష్ణా: ఈనెల 28న గన్నవరం రోటరీ క్లబ్‌లో ఎమ్మెల్యే యార్లగడ్డ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది. 10th,(Pass/Fail), Inter, ITI వారు అర్హులన్నారు. ఉచిత భోజనం వసతి పాటు రూ.12వేలుకు పైగా వేతనం ఉంటుందన్నారు.
పల్నాడు: గురజాల పట్టణంలోని కారంపూడి రోడ్‌లో యాక్సిస్ బ్యాంక్ సమీపంలోని ఓ నీటిబావిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావిలో నుండి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
GNTR: ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి గ్రామాలకు చెందిన రైతులు పంటలను తొలగించవద్దని మంత్రి నారాయణను కోరారు. రాజధాని పనులను పరిశీలించడానికి వచ్చిన మంత్రిని రైతులు కలిశారు. పశువుల మేత కోసం జొన్న, పెసర లాంటి పంటలను వేయడం జరిగిందని, కొంతమంది వేరే పంటలను సాగు చేస్తున్నారని అన్నారు. రహదారుల నిర్మాణంలో అడ్డుగా ఉండే పంటలను తొలగించక తప్పదని మంత్రి తెలిపారు.
GNTR: జిల్లాలో 10శాతం మద్యం దుకాణాలు కల్లుగీత కార్మిక కుటుంబాలకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలోని ఆయా కులాలకు 13 దుకాణాలను కేటాయిస్తూ జేసీ భార్గవ తేజ శుక్రవారం లాటరీ తీశారు. కల్టెక్టరేట్‌లోని జరిగిన ఈ లాటరీలో గౌడ కులస్తులకు దుకాణాలను కేటాయించారు. గుంటూరు, కాకుమాను, పెదనందిపాడు తదితర ప్రాంతాల్లోని దుకాణాలను గౌడ కులస్తులకు ఎంపిక చేశారు.
బాపట్ల: జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు నేర నిరోధక చర్యల్లో భాగంగా చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి కొనిజేటి చేనేతపురిలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామస్తులతో సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న నేరాల తీరు గురించి వివరించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఇరుక్కోవద్దని హితవు పలికారు.
ATP: అనంతపురంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, జిల్లా ఎస్పీ పి.జగదీశ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మాక్ డ్రిల్‌ను జేసీ, ఎస్పీ పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
GNTR: చిన్న వయసులో తెలియక ప్రేమ వివాహాలు చేసుకొని బాలికలు మోసపోవద్దని ఎస్సై వెంకటకృష్ణ అన్నారు. చేబ్రోలులోని SNG హైస్కూల్లో మహిళా పోలీసులు ఆధ్వర్యంలో శుక్రవారం బాలికలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని, ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
GNTR: వికలాంగుడికు ఉచిత పెట్రోల్ మంజూరుకై దృవీకరణ కోసం అందిన అర్జీని 24గంటలలోపు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్టిఫికెట్‌ను అందించామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో బాలకృష్ణ అనే వ్యక్తికి కమిషనర్ సర్టిఫికెట్‌ను అందించారు. అర్జీ పరిష్కారంలో త్వరితగతిన స్పందించిన పీఓ రామారావుని కమిషనర్ అభినందించారు.
NLR: కావలి కనకపట్నం ఎమ్మెల్యే కావ్యతోనే సాధ్యమని టీడీపీ నేత తిరువీధి ప్రసాద్ అన్నారు. కావలి పట్టణంలోని ట్రంకు రోడ్డుకు దివంగత నేత మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం కావలి పట్టణంలోని ఐ లవ్ యు కావలి సెల్ఫీ పాయింట్ దగ్గర నేతలు సంబరాలు చేశారు.
అన్నమయ్య: మునిసిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని శుక్రవారం మదనపల్లె పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం ముందు కార్మికులు నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరి శర్మ మాట్లాడుతూ.. పీఎఫ్, ఈఎస్ఐ సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే డైలీ వేజెస్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
NLR: జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ శుక్రవారం సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిరుమలతిప్ప ఎస్టీ ఏరియాను సందర్శించారు. వైద్య సిబ్బంది చేస్తున్న లెప్రసీ సర్వేను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, స్థానిక వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.