అన్నమయ్య: మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళ్యం పంచాయతీ పరిధి పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే కారణంతో దంపతులపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన కుక్కల నగేష్, మల్లికార్జున, హరికృష్ణ, మాలతి, రాహుల్ తమను దారుణంగా కొట్టారని బాధితులు శంకర, ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శనివారం తెలిపారు.