ఏలూరు టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని జంతువుల కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు దైవభక్తి లేదని, అపవిత్ర పాలన సాగించారని విమర్శించారు.