BHPL: భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గ్రామాలు, పట్టణాల్లో చల్లని వాతావరణం నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో పంటలు ఆరబోసిన రైతులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.