రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భూముల ధరలు పెరగనున్నాయి. ప్రాంతాలవారీగా భూముల విలువ 50-100 శాతం పెంచినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వానికి రూ.1200 నుంచి 1400 కోట్ల ఆదాయం లబ్ది చేకూరనుంది. భూముల మార్కెట్ వ్యాల్యూ పెంపుతో రైతులకు లాభం జరగనుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.