PPM: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25న పార్వతీపురంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి సాయి కృష్ణచైతన్య తెలిపారు. గాయత్రి కళాశాలలో జరిగే ఈ మేళాకు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన వారు హాజరు కావచ్చన్నారు. పూర్తి వివరాలు కొరకు వెబ్‌సైట్‌ను చూడొచ్చని తెలిపారు.
ప్రకాశం: చీమకుర్తిలో ఈ నెల 31వ తేదీన తిరుణాళ్లు నిర్వహించనున్నారు. దీంతో వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలు నెలకొల్పనున్నారు. సాయంత్రం సమయాల్లో సాంస్కృతి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేయనున్నారు. ఈ తిరుణాల మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
KRNL: ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ ధర రూ.310, స్కిన్‌లెస్ రూ.340 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ.10-20 వరకు పెరిగాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. కోళ్లు ధరలు పెరగడంతో వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారస్తులు అన్నారు.
KDP: ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం, కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.300, స్కిన్‌లెస్ చికెన్ రూ.342, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.
W.G: కలెక్టర్ నాగరాణి చొరవతో జిల్లాలో రూ.1.30 కోట్లతో “మీ ఇంటికి-మీ డాక్టర్” సేవలు ప్రారంభం కానున్నాయి. రేపు నరసాపురం మండలంలోని 18 గ్రామాల్లో ఈ మొబైల్ మెడికల్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాన్‌లో డాక్టర్లు, నర్సుల బృందం నేరుగా గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు.
శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద మహిళల కోసం ఫీడింగ్ రూమ్, పింక్ టాయిలెట్ల ను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాన కూడళ్లలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ATP: రాయదుర్గం సిద్ధప్పకొండపై వెలసిన శ్రీ రస సిద్ధేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రథానికి గుర్రాలను పంపే ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సతీసమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
VZM: రామభద్రపురం మండలం అరికతోటలో శనివారం నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ FMT (Farmer Master Trainer) లక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రకృతి సేద్యంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఈ గ్రామంలో 125 మంది రైతులను ఎంపిక చేసి భూసార పరీక్షలు నిర్వహించి ఏయే పంటలు సాగుచేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
సత్యసాయి: చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన పరుచూరి కృష్ణయ్య 60 శనివారం చిర్లవారికండ్రిక సమీపంలో కళ్లు గీయడానికి వెళ్లాడు. అక్కడ చెట్టు కింద కూర్చున్న సమయంలో రక్తపింజరి పాము కాటు వేసింది. వెంటనే స్థానికులు అతన్ని పొదలకూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ కృష్ణయ్య మృతి చెందాడు.
NLR: జిల్లాలో మాంసం ధరలు కాస్త పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.304, స్కిన్ లెస్ చికెన్ రూ.317, నాటుకోడి మాంసం కేజీ రూ. 700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
W.G: సీపీఎం చేపట్టిన ‘ప్రజా చైతన్య పాదయాత్ర’ను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు శనివారం రాత్రి అభినందించారు. భీమవరంలో సాగుతున్న యాత్రను చూసి తన వాహనాన్ని ఆపి, బృందంతో మాట్లాడారు. ఈ సందర్భంగా JNV గోపాలన్ ప్రజా సమస్యలపై రూపొందించిన వినతిపత్రాన్ని ఛైర్మన్‌కు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న ఈ కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు
E.G: రాజమండ్రి టూ టౌన్ పరిధిలో శనివారం ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. టీ నగర్‌లోని కోడూరి ప్లాజాలో నివసిస్తున్న గోవింద్ సూతర్ (29) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన CI శివ గణేశ్ దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: ఎమ్మిగనూరు పట్టణం 30వ వార్డులో 21 ఏళ్ల యువకుడు గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ, వైసీపీ వార్డు ఇన్‌ఛార్జ్ కోరిశెట్టి విశ్వనాధ్, తదితర నాయకులు మృతుడి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబానికి సానుభూతి తెలుపుతూ.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు ఉన్నారు.
NDL: బనగానపల్లె మండలం పలుకూరులో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రూ.1.88 కోట్ల విలువైన సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి క్యాంప్ కార్యాలయం తెలిపింది. సాయంత్రం 5:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.