ATP: గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన సిరిచాటి రవి, నాగరత్నమ్మ కుమార్తె నవనీత వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆదివారం రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.