W.G: తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఏబీవీపీ పూర్వ విద్యార్థి నాయకుడు మంగుతుర్తి మెహెర్ రాజ్ శనివారం బీజేపీలో చేరారు. భీమవరంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని మంత్రి శ్రీనివాస్ వర్మ సూచించారు. మోదీ నాయకత్వంలో సుసంపన్నమైన పాలన ప్రజలకు లభిస్తుందన్నారు.