CTR: ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 4వ వార్డు కట్టమంచి లాయర్స్ కాలనీలో రూ. 19.30 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాలువలను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. లాయర్స్ కాలనీ ఎక్స్టైన్షన్కు“వెంకటరమణ నగర్”గా నామకరణం చేసి ఆవిష్కరించారు.