సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మానవత్వాన్ని చాటుకున్నారు. అటుగా వెళ్తున్న ఆర్కే కాన్వాయ్ ఆపి.. ఆటోను పైకి లేపేందుకు సాయం చేశారు.
గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడరని, వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని..వైసీపీ నాయకుల ఫిర్యాదుతో నారా లోకేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఏపీలోని విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. ఈ నేపథ్యంలో ఓ షోరూంలో ఉన్న దాదాపు 300కు పైగా బైక్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ఆరంభించారు.
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నేతల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటించిన విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) మంత్రి విడదల రజనీ(Vidadala Rajini)పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు కీలక నేతలను విడదీశారని గుర్తుచేశారని తెలిసింది
గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, రోగ నిరోధక శక్తి ఉందని ఈమధ్యనే గాడిద పాలను కొనుగోలు చేయడం ఎక్కువవుతోంది.
తనకు ప్రాణహాని ఉందని, అది కూడా టీడీపీ నేత నారా లోకేష్ నుంచేనని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు.
మినీ జమిలీ ఎన్నికలపై బీజేపీ ఆలోచిస్తోంది. ఫిబ్రవరిలో 12 రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు.. లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోంది.
యాంకర్ అనసూయ రాజకీయాల్లోకి వస్తారని జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమె ఇటీవల ఏడ్చిన వీడియో రిలీజ్ చేసి.. సానుభూతి పొందే ప్రయత్నం చేశారని తెలిపారు.
యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి
బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను తాను ఏమీ అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజ్ గిరి, మెదక్ ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని.. హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈనెలాఖరు వరకూ ఆ రైళ్లు రద్దయ్యాయి. విజయవాడకు వెళ్లే సెక్షన్ పరిధిలో వివిధ పనులు నిమిత్తం రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులను టీటీడీ భయపెడుతోందని, వేంకటేశ్వరస్వామిని అవమానిస్తే పుట్టగతులుండవని బీజేపీ నేత బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై విమర్శలు గుప్పించారు.
తిరుమల శ్రీవారి భక్తుల కోసం రైల్వే శాఖ మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనుంది. పుదుచ్చేరి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది.
2019 ఎన్నికలకు ముందు, కొంతమంది టాలీవుడ్ నటులు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ వేవ్‌ని పసిగట్టారు. ఆ సమయంలో అందరూ జగన్‌కు మద్దతుగా నిలిచారు. వైసీపీ కోసం ప్రచారం చేశారు. అలాంటివారిలో టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కూడా ఒకరు. వైసీపీ తరపున ప్రచారం చేస్తూ మీడియా ముందు కూడా వచ్చారు. ఎన్నికల ప్రచారం చేశాడు. పార్టీలో కూడా చేరాడు.