వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో(telugu states) మూడు రోజుల పాటు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు తీవ్రమైన గాలులు కూడా వీస్తాయని ప్రకటించారు.
తెలుగు యువకుడి గురించి ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో కథనం వెలువడింది. వాహనాల రద్దీని తెలుసుకుని తమ ప్రయాణాన్ని సాఫీగా సాగించే కొత్త టెక్నాలజీని కనిపెట్టడంతో ఆ వ్యక్తికి మంచి గుర్తింపు లభించింది.
గన్నవరం ఎమ్మెల్యే కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.
దేశంలోని మొత్తం ఎంపీల ఆస్తులను బయటపెట్టింది ఎడీఆర్ సంస్థ. దీనిలో భాగంగా అందరికంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న ఎంపీలు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం విశేషం. మొత్తం బీజేపీ 85 మంది ఎంపీల ఆస్తుల కన్న వీరి ఆస్తి రెండింతలు ఉంది.
ఫేక్ బాబాల డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏదో ఒక పేరుతో.. మారుమూల ప్రాంతంలో వెలుస్తున్నారు. అమాయకులను నమ్మించి.. లక్షల్లో దండుకుంటున్నారు. విజయవాడలో ఓ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. రిటైర్మెంట్ డాక్టర్ ఇంట్లో హత్య జరిగింది. వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయమే ఈ హత్యకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. యజమానికి భయపడే హత్య చేసినట్లు నిందితురాలు కూడా ఒప్పుకోవడం విశేషం.
చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ తీసిన జాబిల్లి తొలి ఫొటోలను ఇస్రో విడుదల చేసింది
సాధారణంగా ఏదైనా ఆహారం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తినడం అందరు చేసేదే. అయితే అలా నిల్వ ఉంచిన ఆహారం తిని ఓ కుటుంబంలోని అక్కా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాలనను ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మరోసారి సత్తా చాటనుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేయనుందని తెలిసింది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం.. వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.
తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత కోసం కర్రలు ఇస్తామని ప్రకటించిన నిర్ణయంపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) స్పందించారు. వాటిలో నిజం లేదని అన్నారు. భక్తుల భద్రత కోసం తాము ఖర్చు విషయంలో వెనుకాడబోమని అన్నారు.
తిరుమలలో కాలినడన వెళ్లే అలిపిరి మార్గంలో చిరుతపులుల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని బంధించేందుకు అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటివల ఒక చిరుతపులి బంధీ కాగా, తాజాగా మరోకటి బోనులో చిక్కింది.
టాలీవుడ్ దర్శకుడు RGV పై దేవినేని ఉమా ఫైర్ అయ్యారు
కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి.. కత్తెర కడుపులోనే మరచిపోయాడు సర్కార్ దవాఖాన వైద్యుడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కడుపు నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో తిరిగి ఆస్పత్రికి వచ్చింది ఆ బాధితురాలు. ఎక్స్ రే తీయగా కడుపులో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంటర్‌లో బైపీసీ చదివి, మంచి కాలేజీలో ఇంజినీరింగ్ చేయాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఇలా తడబాటునకు గురయ్యారు.